ఈ రోజు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో ముంబై మ్యాచ్... ఏ జట్టు కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పైన అన్ని విభాగాల్లో విజృంభించి విజయాన్ని సొంత చేసుకుంది.ఈ రోజు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను కాపాడుకోవాలి అనుకుంటుంది.

 Mumbai Indians Vs Sunrisers Hyderabad Match Prediction-TeluguStop.com

ఇకపోతే 12 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్ కి ఒక్క అడుగు దూరం లో ఉంది.గత మ్యాచ్ లో ముంబై జట్టు టాప్ ఆర్డర్ వైఫల్యం తో మ్యాచ్ ని కోల్పోయినప్పటికి హార్దిక్ పాండ్య అద్భుతమైన బ్యాటింగ్ అందరిని ఆకట్టుకుంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్ లు జరగగా సన్ రైజర్స్ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించగా ముంబై ఇండియన్స్ జట్టు 6 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ ముంబై లో ని వాన్ఖడే స్టేడియం లో జరగనుంది.ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు లక్ష్య చేదన కు ఇష్టపడుతుంది.

3)సన్ రైజర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

విదేశీ ఆటగాళ్లయిన జానీ బైర్ స్టో , డేవిడ్ వార్నర్ లో కీలక మ్యాచ్ ల సమయం లో సన్ రైజర్స్ జట్టు కి అందుబాటులో లేకపోవడం ఆ జట్టు కి పెద్ద దెబ్బే.గత మ్యాచ్ లో కోల్ కత్తా పైన మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ స్వదేశానికి వెళ్ళిపోయాడు , అతని స్దాన లో మార్టిన్ గుప్తిల్ ఆడనున్నాడు.

ఈ సీజన్ లో పెద్దగా ఆకట్టుకొని సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ కీలక మ్యాచ్ లో ఎలా ఆడుతాడో చూడలి.ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ , రషీద్ , ఖలీల్ , నబి లతో పటిష్టంగా నే కనిపిస్తుంది.

ముంబై జట్టు బ్యాట్స్ మెన్ లను కట్టడి చేస్తే హైదరాబాద్ జట్టు కి విజయావకాశాలు ఉంటాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI ) – మార్టిన్ గుప్తిల్ , వృద్ధిమాన్ సహా , కేన్ విలియమ్సన్ ,విజయ్ శంకర్ , మహమ్మద్ నబి , మనీష్ పాండే , అభిషేక్ శర్మ ,రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , ఖలీల్ అహ్మద్ , సందీప్ శర్మ

4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లలో నెగ్గి దాదాపు ప్లే ఆఫ్స్ కి అర్హత సాదించినట్లే .సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ ఆ జట్టు కి కీలకంగా మారనుంది.ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాల పైన ఆధార పడకుండా ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించవచ్చు.

ఇక ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో కోల్ కత్తా జట్టు పైన అన్ని విభాగాల్లో దారుణమైన ప్రదర్శన చేసింది.బౌలింగ్ లో బుమ్రా , మలింగ లాంటి స్టార్ బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

సన్ రైజర్స్ జట్టు పైన భారీ స్కోర్ చేయగలిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – రోహిత్ శర్మ , డికాక్ ,సూర్య కుమార్ యాదవ్ ,ఇషాన్ కిషన్ , కృనల్ పాండ్య , హార్దిక్ పాండ్య , కిరాన్ పొలార్డ్ , రాహుల్ చహార్ , లసిత్ మలింగ , జస్పిరిత్ బుమ్రా ,బ్యూరం హేంద్రిక్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube