దుమ్మురేపిన డికాక్ .. ముంబై ఘన విజయం !  

ipl, ipl2020, mi,kkr, morghan, rohitsharma, dekock - Telugu @rohitsharma, Dekock, Ipl, Ipl2020, Kkr, Mi, Morghan

ఐపీఎల్ 2020 సీజన్ ముంబై ఇండియన్స్ హవా కొనసాగుతోంది.అబుదాబిలో కోల్‌కతాపై సునాయాసంగా గెలిచి.పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.149 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో చేధించి.విజయం అందుకుంది.

TeluguStop.com - Mumbai Indians Vs Kolkata Knight Riders Rohit Sharma Team Won By 8 Wickets

కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.44 బంతుల్లో 78 పరుగులు చేశాడు.ఈ ఇన్సింగ్స్‌లో 3 సిక్స్ ‌లు, 9 ఫోర్లతో కోల్‌కతా బౌలింగ్‌ ను ఊచకోత కోశాడు.

ఇక , కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించాడు.చివర్లో బిగ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా మెరిశాడు.10 బంతుల్లో 20 పరుగులు (1 సిక్స్, 3 ఫోర్లు) చేశాడు.కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం మావి చెరో వికెట్ సాధించారు.

TeluguStop.com - దుమ్మురేపిన డికాక్ .. ముంబై ఘన విజయం -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది.కమ్మిన్స్ 53 రన్స్‌తో అదరగొట్టాడు.కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులతో బాధ్యాతాయుత ఇన్సింగ్స్ ఆడాడు.శుభమాన్ గిల్ 21 రన్స్ చేశాడు.

మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేదు.టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది.

ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి.మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.ఇద్దరూ కలిసి 87 పరుగులు చేశారు.

.

#Morghan #IPL2020 #Dekock #@RohitSharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai Indians Vs Kolkata Knight Riders Rohit Sharma Team Won By 8 Wickets Related Telugu News,Photos/Pics,Images..