ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో ముంబై మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి.  

Mumbai Indians Vs Kolkata Knight Riders Match Predictions-

సీజన్ ఆరంభం లో ఉత్కంఠ మ్యాచ్ లలో విజయాలు సాధించి మంచి జోరు మీద ఉన్న కోల్ కత్తా జట్టు వరుస ఓటములతో దాదాపు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు లేవు. కోల్ కత్తా గెలిచిన కొన్ని మ్యాచ్ లు కూడా రస్సెల్ ఆడిన ఆటే కారణం..

ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో ముంబై మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి.-Mumbai Indians Vs Kolkata Knight Riders Match Predictions

ఇకపోతే ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో చెన్నై పైన గెలిచి దాదాపు ప్లే ఆఫ్స్ కి సీటు ని బెర్తు చేసుకుంది. ముంబై ఆడబోయే మ్యాచ్ లన్నిటిలో గెలిచి పాయింట్ ల పట్టికలో అగ్రస్థానం చేజిక్కిచుకోవాలని ఆశిస్తోంది.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్ లు జరగగా కోల్ కత్తా 5 మ్యాచ్ లలో గెలవగా , ముంబై ఇండియన్స్ జట్టు 18 మ్యాచ్ లలో గెలిచింది.

పిచ్ ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా తో ముంబై మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది ..

ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుస ఓటములతో నిరాశ లో ఉన్న కోల్ కత్తా జట్టు బ్యాటింగ్ లో వరుసగా వైఫల్యం అవుతూ వస్తుంది. ఆ జట్టు భారీ స్కోర్ చేసి చాలా మ్యాచ్ లు అయింది.

ఆ జట్టు బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ , రాబిన్ ఉతప్ప లు భారీ ఇన్నింగ్స్ లు ఆడి చాలా మ్యాచ్ లు అయ్యాయి. ఒకవేళ కోల్ కత్తా జట్టు టాప్ ఆర్డర్ రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ లు చేసే అవకాశం ఉంది. సీజన్ ఆరంభం నుండి ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడని దినేష్ కార్తిక్ ఢిల్లీ జట్టు పైన 97 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. కోల్ కత్తా బౌలింగ్ లో కుల్దీప్ , నరైన్ లాంటి టాప్ స్పిన్నర్లు ఉన్నపటికీ వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు

ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై ఇండియన్స్ ఆడిన తమ గత మ్యాచ్ లో చెన్నై తో అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని సాధించింది. ముంబై కెప్టెన్ అయిన రోహిత్ శర్మ చెన్నై మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి ఫామ్ లోకి వచ్చాడు.

ఇక ఆ జట్టు అల్ రౌండర్ లు అయిన హార్దిక్ పాండ్య , కిరాన్ పొలార్డ్ లు ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు. బౌలింగ్ లో మలింగా , బుమ్రా లతో బలంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారంగా ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కి చేరే జట్టు అవుతుంది.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – డికాక్ , రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య , కిరాన్ పొలార్డ్ , రాహుల్ చహార్ , బెహరెండోర్ఫ్ , మలింగ , బుమ్రా