ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో ముంబై మ్యాచ్ .. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి..

ముంబై ఇండియన్స్ , పంజాబ్ జట్లు తమ గత మ్యాచ్ లు సన్ రైజర్స్ పైన గెలవగా , ముంబై ఇండియన్స్ 136 పరుగుల లక్ష్యాన్ని కాపడుకోగలిగింది.ముఖ్యంగా వెస్టిండీస్ యువ బౌలర్ అల్జర్రి జోసెఫ్ ఏకంగా 6 వికెట్ లు తీసి ఐపీఎల్ లో సోహైల్ తన్విర్ 10 సంవత్సరాల రికార్డ్ ను బ్రేక్ చేసాడు.

 Mumbai Indians Vs Kings Xi Punjab Match Prediction-TeluguStop.com

బ్యాటింగ్ లో ముంబై ఓపెనర్లు రోహిత్ , డి కాక్ మంచి ఆరంభాన్ని ఇస్తే చాలు ఆ జట్టు 180 పరుగుల పైగా చేసే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే పంజాబ్ జట్టు కూడా బౌలింగ్ లో బ్యాటింగ్ లో సమిష్టిగా రాణిస్తుంది.

ఆ జట్టు ఓపెనర్ రాహుల్ వరుసగా రెండు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు , మరో ఓపెనర్ క్రిస్ గేల్ ఫామ్ లోకి రావాల్సి ఉంది.బౌలింగ్ లో షమీ , కుర్రాన్ , ఆక్సర్ పటేల్ తో బలంగా కనిపిస్తుంది.

1)ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్ లు జరగగా ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ ల్లో గెలవగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 11 మ్యాచ్ ల్లో గెలిచింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ ముంబై ల్పని వాన్ఖడే స్టేడియం లో ఆడనుంది.ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.పవర్ ప్లే లో వికెట్ లను కాపాడుకుంటే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.

3)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

పంజాబ్ జట్టు లో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చు.ఆ జట్టు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉండడం వారికి కలిసొస్తుంది.పంజాబ్ స్టార్ ఆటగాడు ఓపెనర్ క్రిస్ గేల్ ఫామ్ లోకి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ కి తిరుగు ఉండదు.రాహుల్ , మయాంక్ , గేల్ , సర్ఫరాజ్ , మిల్లర్ లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

బౌలింగ్ లో షమీ , రెహ్మాన్ , కుర్రాన్ కూడా రాణిస్తున్నారు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ గేల్ , రాహుల్ , సర్ఫరాజ్ , మయాంక్ అగర్వాల్ , డేవిడ్ మిల్లర్ , శ్యామ్ కుర్రాన్ , అశ్విన్ , అక్షర్ పటేల్ , ముజీబ్ రెహ్మాన్ , షమీ , అంకిత్ రాజ్ పుత్

4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై ఇండియన్స్ తమ గత మ్యాచ్ లో సన్ రైజర్స్ తో బ్యాటింగ్ లో తడబడిన అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ జట్టుని 100 పరుగుల లోపే కట్టడి చేశారు.ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణిస్తే ముంబై జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉండొచ్చు.ఆ జట్టు లో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చు.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – రోహిత్ శర్మ , డి కాక్ , సూర్య కుమార్ యాదవ్ , కిషన్ కిషన్ , హార్దిక్ పాండ్య , పొలార్డ్ , కృనల్ పాండ్య , జోషేఫ్ , మార్కడేయా , బుమ్ర , బేహారండాఫ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube