ఈ రోజు ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై తో ముంబై మ్యాచ్ .. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి

మొదటి క్వాలిఫైయర్ లో చెన్నై జట్టు పైన విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కి చేరితే , రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన విజయం సాధించి చెన్నై జట్టు ఫైనల్ కి చేరుకుంది.ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్ లో జరగనుంది.

 Mumbai Indians Vs Chennai Super Kings Ipl Finals 2019 Match Prediction-TeluguStop.com

ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరగగా మూడింట్లో ముంబై ఇండియన్స్ జట్టే విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 10 ఐపీఎల్ సీజన్ లలో 8 సార్లు ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది.

ఇప్పటి వరకు 3 సార్లు విజేతలు గా నిలిచినా చెన్నై జట్టు ఈసారి ముంబై జట్టు పైన గెలిచి నాలుగో సారి ట్రోఫీ ని చేజిక్కించుకోవాలని చూస్తుంది.ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో పాయింట్ ల పట్టిక లో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై పైన విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.ఆ జట్టు ఈసారి ఫైనల్ లో గెలిస్తే 4 వ సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న జట్టుగా నిలుస్తుంది.

1)ఇరు జట్ల మధ్య రికార్డు లు ఎలా ఉన్నాయి

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఆధిపత్యం చలాయించిన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ జట్టే.ఇప్పటి వరకు అన్ని ఐపీఎల్ లు కలుపుకొని ఇరు జట్లు 29 మ్యాచ్ లు ఆడగా ముంబై ఇండియన్స్ జట్టు 17 సార్లు గెలుపొందగా చెన్నై జట్టు 12 సార్లు విజయం సాధించింది.

ఐపీఎల్ ఫైనల్స్ లో ఇరు జట్లు 3 సార్లు తలపడగా అక్కడ కూడా ముంబై జట్టే ఆధిక్యం లో ఉంది .ఫైనల్స్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో చెన్నై ఒక మ్యాచ్ లో గెలిచి ట్రోఫీ అందుకోగా , ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.

ఈ రోజు ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై

3)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో గెలవడానికి ఫైనల్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన షేన్ వాట్సన్ ఈ సీజన్ లో ఒకటి రెండు ఇన్నింగ్స్ లు మినహాయించి అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు.అయినా చిన్న జట్టు అతడి పైన నమ్మకం ఉంచి తుది జట్టు లోకి తీసుకుంటుంది.ఢిల్లీ తో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో అర్ద శతకం సాధించి జట్టుకి విజయాన్ని అందించాడు.

ఇకపోతే మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఫామ్ లోకి రావడం చెన్నై జట్టుకు సానుకూలాంశం.ఆ జట్టు మిడిల్ ఆర్డర్ ముంబై తో జరిగే మ్యాచ్ లో రాణిస్తే 4 వ సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకునే అవకాశం ఉంటుంది.

బౌలింగ్ లో తాహిర్ , బజ్జి , చాహర్ లతో బలంగా కనిపిస్తుంది.ఈ మ్యాచ్ లో ముంబై జట్టు పైన గెలిచి గత మ్యాచ్ ల ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI) – షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ధోని, బ్రావో, జడేజా , దీపక్ చాహర్, శార్దూల ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్

ఈ రోజు ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై

4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఈ సీజన్ లో చెనని తో ఆడిన మూడు మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించి జోరు మీద ఉన్న ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఐపీఎల్ కప్ ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు.ఇక ముంబై బ్యాటింగ్ లో రోహిత్, డికాక్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లతో బలంగా కనిపిస్తుంది.బౌలింగ్ మలింగా , బుమ్రా , క్రునల్ లు విజృంభిస్తే చెన్నై పైన ఈ సీజన్ లో నాలోగో విజయం సాధించడం ఖాయం.

ముంబై ఇండియన్స్ జట్టు (PROBABLE XI) – రోహిత్ శర్మ , డికాక్, సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, క్రునల్ పాండ్య, కిరాన్ పోలార్డ్ , జాస్పిరిత్ బుమ్రా , లసిత్ మలింగా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube