విదేశీ లీగ్స్ లో ముంబై ఇండియన్స్.. రెండు కొత్త జట్లతో రంగంలోకి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కి రికార్డు ఉంది.ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

 Mumbai Indians In Foreign Leagues. Entered The Field With Two New Teams. International League, Mumbai Indians, Sports Update, Teams, Sports News-TeluguStop.com

ఇప్పుడు ఈ జట్టు దృష్టి విదేశీ లీగ్ లపై పడింది.అందుకే విదేశీ లీగ్ ల కోసం రెండు కొత్త జట్లను ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం.

యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20, క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసింది.ఈ రెండు జట్లు విదేశీ లీగ్ లలో రంగంలోకి దిగనున్నాయి.

 Mumbai Indians In Foreign Leagues. Entered The Field With Two New Teams. International League, Mumbai Indians, Sports Update, Teams, Sports News -విదేశీ లీగ్స్ లో ముంబై ఇండియన్స్.. రెండు కొత్త జట్లతో రంగంలోకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు జట్లకు కొత్త పేర్లను కూడా ప్రకటించింది.యూఏఈ లీగ్స్ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates) అని పేరు పెట్టగా, సౌతాఫ్రికా ఫ్రాంచైజీకి ముంబై కేప్ టౌన్(MI Cape Town) అని నామకరణం చేసింది.

అయితే రెండు పేర్లలోనూ ముంబై ఇండియన్స్ బ్రాండ్ అలాగే ఉంచింది.ఇక రెండు ఫ్రాంచైజీల ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ బ్లూ, గోల్డ్ తో కలిసి ఉన్న జెర్సీనే ధరించనుననారు.

అయితే కేవలం లోగో మాత్రమే మారనుంది.ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ట్విట్టర్ లో వెల్లడించంది.

Telugu Mumbai Indians, Teams-Latest News - Telugu

ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ, మా ఫ్యామిలీలో సరికొత్త ఫ్రాంచైజీలు ముంబై ఎమిరేట్స్, ముంబై కేప్ టౌన్ రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు.ఎంఐ అనే పేరుతో తమకు, క్రికెట్ కి మంచిన అనుబంధం ఉందని, తమ కొత్త ఫ్రాంచైజీలు కూడా ఒకే నైతికతను స్వీకరిస్తాయని తెలిపారు.ఎం స్థాయిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మొత్తం ఆరు జట్లు ఉండగా.అన్నింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొన్నాయి.జొహన్నెస్ బర్గ్ ని చెన్నై సూపర్ కింగ్స్, సెంచూరియన్ ని ఢిల్లీ, పార్ల్ జట్టును రాజస్తాన్, డర్బన్ ని లక్నో, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కొనుగోలు చేశాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube