సంచలన తీర్పు ఇచ్చిన ముంబై కోర్ట్!!

ప్రస్తుతం ఉన్న సమాజంలో సహజంగా ఎవరైనా ఏదైనా జరగకూడనిది జరిగి న్యాయం కోసం పోలీసులను, పోలీసు స్టేషన్స్ ను ఆశ్రయిస్తారు.కానీ ఒక పక్క అధికార పెత్తనం, మరోపక్క డబ్బు వ్యామోహంతో న్యాయం జరగవలసిన చోటనే అన్యాయం పడగ విప్పి నాట్యం చేస్తుంది.

 Mumbai High Court Sensational Orders-TeluguStop.com

ఇక ప్రతీ చోటా దాదాపుగా అలానే జరుగు ఉండడంతో సామాన్యుడు పోలీసులను ఆశ్రయించాలి అంటేనే భయంతో వణికి పోతున్నాడు.అలాంటి వారికి అండగా ఉండేలా ముంబై కోర్ట్ ఒక కేసు విషయమై సంచలన తీర్పును ఇచ్చింది.

మహరాష్ట్రలోని ఒక పోలీస్‌స్టేషన్లో జరిగిన లాకప్‌ డెత్‌ కేసుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంలో ముంబై కోర్ట్ న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రం మొత్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.ఇక దీనిపై ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని.

ఇప్పటికిప్పుడే సీసీ కెమేరాల ఏర్పాటు సాధ్యం కానప్పటికీ.కొంత సమయం పడుతుందని చెప్పారు.

మరి దీనిపై ముంబై రాష్ట్రం ఎలా స్పందించి ముందుకు పోతుందో చూడాలి.కనీసం ఈ పద్దతితో అయినా న్యాయం శాతం పెరుగుతుంది అని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube