బిడ్డ చావుకు కారకుడు డాక్టరే

నిండు గర్భిని మరికాసేపట్లో లోకానికి ఒక ముక్కుపచ్చలారనిబిడ్డ ను కనబోతుంటే డాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో పండంటి బిడ్డ ఒక నర్సు చేతులమీదుగా ఈ లోకంలోకి వచ్చింది .ఆ బిడ్డ మృతికి కారణమయ్యాడని ఆ వైద్యుడికి ముంబైలోని వినియోగదారుల ఫోరం భారీ ఫైన్ రూ.19 లక్షల నష్టపరిహార చెల్లించాలని ఆదేశించింది.బిడ్డను కోల్పోయిన ఆ మాతృమూర్తికి జాప్యం లేకుండా చెల్లించాల్సిందే అని తీర్పులో పేర్కొంది .2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆస్పత్రికి తరచూ వెళ్లేది.అక్కడే అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆస్పత్రికి వెళ్లినప్పుడు సదరు వైద్యుడు మరో ఆస్పత్రికి పంపేసి చేతులు దులుపుకున్నాడు.

 Mumbai Doctor Fined For Absence During Delivery-TeluguStop.com

ఆమె కాందివ్లి లోని మరో ఆస్పత్రికి వెళ్లారు.అక్కడి వైద్యుడు నిర్లక్ష్య వైఖరితో పరీక్షలు నిర్వహించి నర్సుకు చూసుకోమని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు.నర్సు తనకు వచ్చిన దే చేసి చూపేయడం తో పాప పుట్టిన ఓ అరగంటలో చనిపోయింది.దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంలో కేసు వేసారు .నేడు కాందివ్లి వైద్యుడు రూ.19 లక్షలు చెల్లించాల్సిందేనని ఆ ఫోరం ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube