7 లక్షల మందికి కరోనా పరీక్షలు,ఎక్కడంటే

ముంబై లోని ధారావీ మురికివాడలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం సృష్టించింది.దీనితో ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావీ లో కరోనా కేసుల సంఖ్య 22 కు చేరింది.

 Mumbai Dharavi, Corona Tests, Municipal Officers, Coronavirus, 7 Lakh People, Qu-TeluguStop.com

మహారాష్ట్ర లో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ధారావీ లో మాత్రం తొలిగా పెద్దగా కేసులు కనిపించలేదు.అయితే ఇటీవల ధారావీ కి చెందిన ఒక వ్యక్తి కి కరోనా సోకడం తో అధికారులు అప్రమత్తమై పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆ ప్రాంతం కి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్ రావడం తో ముంభై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 7 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.ధారావీ ప్రాంతం అతిపెద్ద మురికివాడ, ఈ క్రమంలో అక్కడ కరోనా మరింత గా ప్రబలుతుంది అన్న ఉద్దేశ్యం తో అధికారులు అప్రమత్తమయ్యారు.

ధారావీ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా తో మృతి చెందడం కూడా వారిని కలవరపెడుతుంది.
ఎందుకంటే ఇటీవల ఆ వృద్ధురాలి భర్త అనారోగ్యం తో మరణించడం తో ఆమెను పరామర్శించేందుకు చాలామంది ఇంటికి వచ్చి వెళ్లినట్లు తెలుస్తుంది.

అనంతరం ఆమె అనారోగ్యం కు గురవ్వడం తో కేఈఎం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది.అనంతరం ఆమె కు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోవడం తో ఆమె మృతి చెందింది.

ఆమె తో పాటు ఆమె తండ్రి,కుమారుడు కి కూడా కరోనా పాజిటివ్ రావడం తో ఇప్పుడు ఆమెను పరామర్శించిన వారందరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.దీనితో అధికారులు ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పరీక్షలు నిర్వహించి కరోనా నిర్ధారణ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.

మురికి వాడ కావడం తో అక్కడ అపరిశుభ్రత అనేది తాండవిస్తుంది ఈ క్రమంలో కరోనా విలయతాండవం చేస్తుంది అన్న ఉద్దేశ్యం తో అధికారులు ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా ధారావీ కి చెందిన 50 మంది ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు.అక్కడ కరోనా కేసులు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం వారందరినీ కూడా రాజీవ్ గాంధీ జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్వారంటైన్ లో ఉంచి, ధారావీ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో 7 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలి అని మున్సిపల్ అధికారులు నిర్ణయించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube