వైరల్‌ : దేశాన్నే ఊపేస్తున్న అన్నింట 35 మార్కుల బాబు అసలు నిజాలు  

Mumbai Boy Gets 35 Marks Out Of 100 In All The Subjects -

గత రెండు మూడు రోజులుగా అక్షిత్‌ జాదవ్‌ అనే మరాఠి కుర్రాడు పదవతరగతి పూర్తి చేశాడు.తాజాగా వచ్చిన ఫలితాల్లో అతడు రాసిన ఆరు సబ్జెక్ట్‌లలో అన్నింటికి కూడా 35 మార్కులు వచ్చాయి.

Mumbai Boy Gets 35 Marks Out Of 100 In All The Subjects

ఏ ఒక్క సబ్జెక్ట్‌లో తగ్గడం కాని పెరగడం కాని రాకుండా వచ్చాయి.అన్ని కూడా బార్డర్‌ బాస్‌ అన్నట్లుగా కాకుండా సరిగ్గా పాస్‌ మార్కులు మాత్రమే వచ్చాయి.

ఇప్పటి వరకు మరాఠి చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఇలా అన్ని సబ్జెక్స్‌లో ఒకే తరహా మార్కులు రావడం జరిగి ఉండదు.కనీసం ఒక్కటి రెండు మార్కుల తేడా అయినా, ఒకటి రెండు సబ్జెక్స్‌లో అయినా తేడా వచ్చే అవకాశం ఉంది.

వైరల్‌ : దేశాన్నే ఊపేస్తున్న అన్నింట 35 మార్కుల బాబు అసలు నిజాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని జాదవ్‌ విషయంలో అలా జరగలేదు.

ఈ కథనం జాతీయ మీడియా సంస్థల నుండి గల్లీ మీడియా సంస్థల వరకు ప్రసారం చేశాయి, ప్రచురించాయి.తెలుగులో అత్యంత నమ్మదగిన మీడియా సంస్థ అంటూ పేరు దక్కించుకున్న ఈనాడు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా కథనంను ప్రచురించిన విషయం తెల్సిందే.అయితే ఈ విషయం పూర్తిగా అబద్దం అని తేలిపోయింది.

అసలు ఇది ఎవరో కావాలని సృష్టించిన పుకారని తేలిపోయింది.అందరు ఒకేలా ఉండరు.

కొందరు లోతుగా ఆలోచించే వారు కూడా ఉంటారు.అలా లోతుగా ఆలోచించే వారు మార్కుల మెమోను కాస్త తీక్షణంగా చూసి దీనిలోని లోపంను గుర్తించారు.

మొత్తం ఆరు సబ్జెక్ట్స్‌ ఉన్నాయి.ప్రతి సబ్జెక్ట్‌ కు 35 మార్కుల చొప్పున వస్తే 210 రావాల్సి ఉంటుంది.కాని ఆ మెమోలో మాత్రం 175 మార్కులు మాత్రమే వచ్చినట్లుగా చూపించారు.ఇక ఆరు సబ్జెక్ట్స్‌కు 600 మార్కులు ఉంటాయి.కాని మెమోలో మాత్రం 500 మార్కులు అని మాత్రమే ఉంది.ఇంకా ఈ బాలుడి విషయంను తీక్షణంగా పరిశీలిస్తే మంచి ఉన్న వారి ఇంటి అబ్బాయే అనిపిస్తుంది.

అలాంటి కుర్రాడు పరీక్షను ప్రైవేట్‌గా రాసుకోవాల్సిన అవసరం ఏంటో మరి.ఇలా అనేక అనుమానాల నడుమ అది కేవలం పుకారు, పుల్కా వార్తా అని తేలిపోయింది.ఈ వార్తా నిజం అయితే జాదవ్ కు సంబంధించిన ఒక్క వీడియో కూడా ఎందుకు రాలేదు చెప్పండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai Boy Gets 35 Marks Out Of 100 In All The Subjects Related Telugu News,Photos/Pics,Images..