ప్రేమించిన అమ్మాయి నో చెప్పిందని 12గంటల హైడ్రామా.! చివరికి ఏమైందో తెలుసా.?   Mumbai Based Model Rohith High Drama Over Love Failure     2018-07-16   11:23:38  IST  Sainath G

ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే…ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు తీసేవారు మరికొందరు. ఒకడు ఆసిడ్ పోస్ట్..మరొకడు నరికి చంపుతున్నాడు. ఇలాంటి ఓ ధారుణమే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. తను ఇష్టపడిన యువతిని పెళ్లాడ్డానికి ఏకంగా ఆమె ఇంటికెళ్లి మొత్తం కుటుంబాన్ని గృహనిర్బంధం చేశాడు.

వివరాల లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ ముంబైలో మోడల్‌గా పనిచేస్తున్నాడు.ఓ యువతితో అతనికి పరిచయమైంది. అయితే ఆమె ప్రేమకు నిరాకరించింది. దీంతో రోహిత్ వేధింపులకు పాల్పడ్డాడు. యువతి తల్లిదండ్రులు కేసు పెట్టగా పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. జైలు నుంచి వచ్చాక కూడా రోహిత్ బుద్ధి మారలేదు.

శుక్రవారం యువతి ఇంటికెళ్లి లోపల గడియపెట్టి తాళం వేసుకున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తనకు ఒక స్టాంపు పేపరు, సెల్ ఫోన్ చార్జర్ కావాలంటూ రోహిత్ వారికి చెప్పాడు. తనను పెళ్లి చేసుకుంటానని యువతితో స్టాంపు కాగితాలపై సంతకం పెట్టించుకుంటానని చెప్పాడు.వీడియో కాల్ ద్వారా పోలీసులతో మాట్లాడాడు.

అతని దగ్గర తుపాకీ, యువతి చుట్టూ రక్తం కనిపించడంతో పోలీసులు జాగ్రత్తగా డీల్ చేశారు. బాల్కనీలోంచి ఆహారం అందించారు. తనను పెళ్లాడ్డానికి యువతి ఒప్పుకుందని, అందుకే ఇంటికొచ్చానని పోలీసులతో రోహిత్ చెప్పాడు. మొత్తం 12 గంటలపాటు హైడ్రామా సాగింది.. పోలీసులతోపాటు ఓ జడ్జి కూడా అక్కడికొచ్చి అతనితో చాకచక్యంగా వ్యవహరించారు. అతనికి నచ్చజెప్పి తలుపు తీయించి యువతిని, ఆమె కుటుంబాన్ని రక్షించారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.