ఈషా పెళ్లిలో జరిగిన ఈ సంఘటనలు ఇండియాలో మరే పెళ్లిలో జరగలేదు.. అంబానీల స్థాయి ఇది  

Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding-

ఇండియాలోనే అపర కుభేరుడు అయిన ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే అంత సాదా సీదాగా ఉంటుందా.అంతా అనుకున్నట్లుగానే ఈ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.జాతీయ మరియు అంతర్జాతీయ సెలబ్రెటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.ముఖేష్‌ అంబానీ కూతురు ఈషా అంబానీ, ప్రముఖ రియల్టర్‌ సంస్థల వారసుడు అయిన ఆనంద్‌తో జరిగిన వివాహ వేడుక నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది.

Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding- Telugu Viral News Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding--Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding-

Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding- Telugu Viral News Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding--Mumbai Airport Has Set A New Record With Isha Ambani’s Wedding-

ఇప్పటి వరకు ఇండియాలో ఎన్నో అత్యంత ఖరీదైన పెళ్లిల్లు జరిగాయి.ఆ పెళ్లిల్లు జనాలు నోరు వెళ్లబెట్టేలా చేశాయి.కాని ఆ పెళ్లిలు చేసిన వారు కూడా అంబానీ ఇంట జరిగిన పెళ్లిని చూసి నోరు వెళ్లబెట్టే పరిస్థితి ఉంది.అంత రిచ్‌గా జరిగిన ఈ వివాహంకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భార్య హిల్లరి క్లింటన్‌ హాజరు అయ్యింది.

దేశ విదేశాల నుండి పదుల సంఖ్యలో ప్రముఖులు ప్రత్యేక విమాన్నాల్లో వచ్చారు.ఇప్పటి వరకు ఇండియాకు ఎప్పుడు కూడా ఇంత భారీగా ప్రైవేట్‌ విమానాలు రాలేదు.విమానాల రాకతో ముంబయి ఎయిర్‌ పోర్ట్‌ కికిరిసి పోయింది.ఆ విమానాశ్రయం అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.

ఇక అంబానీల ఇంట్లో జరిగిన పెళ్లిలో కేవలం బాలీవుడ్‌ తారలు మాత్రమే కాకుండా హాలీవుడ్‌ తారలు కూడా సందడి చేశారు.ముఖ్యంగా హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ ఇచ్చిన స్టేజ్‌ షో కార్యక్రమానికే హైలైట్‌ అంటూ దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తుంది.ఇంతటి అద్బుతమైన వివాహ వేడుక ఎప్పుడు జరుగలేదని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఒకటి ప్రత్యేక కథనంను రాయడం జరిగింది.

అంతర్జాతీయ పత్రిక ఒక ఇండియన్‌ సెలబ్రెటీ పెళ్లి గురించి కథనం రాయడం ఇదే ప్రథమం.ఇక ఈ పెళ్లికి ఖర్చు ఎంత అనే విషయంలో క్లారిటీ లేదు, కాని ఇండియాలో ఇప్పటి వరకు ఏ వ్యాపారవేత్త లేదా మరెవ్వరు కూడా ఖర్చు చేయనంతగా ఈ పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ఖర్చు చేసిందని తెలుస్తోంది.

ఇక ఈ పెళ్లి సందర్బంగా దాదాపుగా 50 వేల మందికి అన్న సంతర్పన కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇండియాలో జరిగిన పెళ్లిల్లో ఎప్పుడు జరగని విధంగా ఈషా పెళ్లిలో జరిగింది.ఇంతటి అద్బుతమైన పెళ్లి మళ్లీ ఇండియాలో ఎప్పుడు జరుగుతుందో అంటూ అంతా చర్చించుకుంటున్నారు.