సంపాదన అంతా కుటుంబానికే సరిపోయేది.. ముమైత్ సంచలన వ్యాఖ్యలు?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న ప్రముఖ నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారించగా గతంలోనే సిట్ ఆమెను డ్రగ్స్ కేసులో విచారించిన సంగతి తెలిసిందే.

 Mumaith Khan Shocking Comments About Her Bank Transactions-TeluguStop.com

ఈడీ అధికారులు కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీయగా కెల్విన్ ఎవరో తనకు తెలియదని ముమైత్ ఖాన్ చెప్పినట్టు తెలుస్తోంది.ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీలకు తాను హాజరు కాలేదని ముమైత్ వెల్లడించినట్టు సమాచారం.

బ్యాంకు లావాదేవీల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించగా తాను సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కుటుంబ పోషణ కొరకు మాత్రమే ఖర్చు చేశానని తాను చేసిన లావాదేవీలలో ఎటువంటి అనుమానాస్పద లావాదేవీలు లేవని ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది.ఈడీ అధికారుల విచారణలో పలువురు సెలబ్రిటీల నుంచి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

 Mumaith Khan Shocking Comments About Her Bank Transactions-సంపాదన అంతా కుటుంబానికే సరిపోయేది.. ముమైత్ సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే పదిమంది సెలబ్రిటీలను అధికారులు విచారించగా తరుణ్, తనీష్ లను విచారించాల్సి ఉంది.

Telugu Bank Transactions, Calvin, Ed Employees, F Club, Family Expenses, Money Laundering, Mumaith Khan, Mumaith Khan Drugs Case, Tanish, Tarun, Tharun, Tollywood Drugs Case-Movie

శుక్రవారం రోజున తనీష్ ఆ తర్వాత బుధవారం రోజున తరుణ్ హాజరు కానున్నారని సమాచారం.మరోవైపు గతంతో పోలిస్తే ముమైత్ ఖాన్ కు ఆఫర్లు అంతకంతకూ తగ్గుతున్నాయని తెలుస్తోంది.హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తున్న నేపథ్యంలో ముమైత్ ఖాన్ కు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.

Telugu Bank Transactions, Calvin, Ed Employees, F Club, Family Expenses, Money Laundering, Mumaith Khan, Mumaith Khan Drugs Case, Tanish, Tarun, Tharun, Tollywood Drugs Case-Movie

బిగ్ బాస్ షో సీజన్ 1లో పాల్గొని ముమైత్ ఖాన్ భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకోవడం గమనార్హం.ఈడీ అధికారుల విచారణ తరువాత నిధుల మళ్లింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.తప్పు చేసినట్టు తేలితే సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.ముమైత్ ఖాన్ మీడియా ముందు డ్రగ్స్ కేసు గురించి స్పందించడానికి ఇష్టపడలేదు.

#Mumaith Khan #Family Expenses #Tarun #Bank #Tanish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు