డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకి క్లీన్ చిట్  

Tollywood Celebrities Clean Chit In Drugs Case-telugu Cinema,tollywood,tollywood Celebrities

తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఇక ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కాలంగా టాలీవుడ్ లో నడుస్తున్న డ్రగ్స్ భూతంకి సంబందించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి.

Tollywood Celebrities Clean Chit In Drugs Case-Telugu Cinema Tollywood

చాలా మంది సినీ ప్రముఖులు ఈ కేసులో ఇరుక్కున్నారు.డ్రగ్స్ డీలర్స్ తో డైరక్ట్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.

అప్పట్లో ఆ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ ని ఊహించని విధంగా తరువాత వేరే డిపార్ట్ మెంట్ కి బదిలీ చేశారు.అయితే అప్పటి నుంచి కేసు విచారణ మాత్రం నడుస్తుంది.

అయితే ఊహించని విధంగా తెరమరుగైన ఈ కేసు మరల తెరపైకి వచ్చింది.ఈ కేసుని విచారించిన సిట్ బృందం డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మూడేళ్లు ఈ కేసు నడుస్తున్న గడుస్తున్నా విచారణ మాత్రం జరగలేదు దీంతో ఆర్టీఐ ద్వారా డ్రగ్స్ కేసు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ శాఖని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కోరిన సమాధానం ఇవ్వలేదు.
దీంతో డ్రగ్స్ విచారణలో టాలీవుడ్ ప్రముఖులకి క్లీన్ చీట్ ఇచ్చారనే మాట వినిపిస్తుంది.

అయితే గతంలో క్లీన్ చీట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన వాటిని విచారణ బృందం కొట్టిపారేసింది.డ్రగ్స్ కేసుపై విచారణ జరుగుతుందని ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపింది.

అయితే ఇప్పుడు ఆర్టీఐకి ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది మాత్రం తెలియలేదు.

తాజా వార్తలు

Tollywood Celebrities Clean Chit In Drugs Case-telugu Cinema,tollywood,tollywood Celebrities Related....