యశ్ మాస్టర్ పై ముమైత్ ఖాన్ ఫైర్.. కారణం?

బిగ్ బాస్ తర్వాత స్టార్ మా లో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ షో ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇక ఇందులో పాల్గొన్న జడ్జిలు, కంటెస్టెంట్ లు తమ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటున్నారు.

 Mumaith Khan Fires In Yash Master In Dance Plusyash Master, Dance Plus, Mumaith-TeluguStop.com

ఇక యాంకర్ గా ఓంకార్ మాటలు అందరికీ తెలిసిందే.ఇక ఇందులో బిగ్ బాస్ లో పాతాళ గంగ పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ జడ్జిగా చేస్తున్న విషయం తెలిసిందే.

Telugu Dance, Mumaith Khan, Yash Master-Movie

ఇక ఏ షోలో నైనా టిఆర్పీ కోసం అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు, జడ్జిలు కొన్నిరకాల సంభాషణలు చేస్తుంటారు.ఒకరిపై ఒకరు గొడవ పడటం, పోట్లాటకు దిగటం, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ని తీసుకురావడం, పర్ఫామెన్స్ మధ్యలో సడన్ ట్రిక్క్ లు చేయడం వంటివి చేస్తుంటారు.ఇదంతా ప్రేక్షకులకు నిజమేనా అన్నట్లు చూపిస్తూ చివరకు ట్విస్ట్ తో వదిలేస్తారు.దీనిని ముందుగానే ప్రోమోలో చూపిస్తూ ప్రేక్షకులకు అందులో తర్వాత ఏం జరుగుతుందో అనేలా చూపిస్తుంటారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ షో ఢీ షో ను మించిపోతుంది.రేటింగ్ లో కూడా డాన్స్ ప్లస్ షో ముందుంది.

ఇక కంటెస్టెంట్ లు తమ పర్ఫామెన్స్ చేసిన తర్వాత జడ్జిలు తమదైన శైలిలో మార్కులు వేస్తుంటారు.ఇక తమ ముందున్న గ్రీన్ బటన్ నొక్కితే పర్ఫామెన్స్ బాగుందని, రెడ్ బటన్ నొక్కితే పర్ఫామెన్స్ నచ్చలేదని జడ్జిలు కంటెస్టెంట్ లకు చూపిస్తుంటారు.

Telugu Dance, Mumaith Khan, Yash Master-Movie

ఇక ఈ షోలో యశ్ మాస్టర్ టీంకు సంబంధించిన కంటెస్టెంట్ చేసిన పర్ఫామెన్స్ పై మరో జడ్జిలు ముమైత్ ఖాన్ విరుచుకు పడగా ముమైత్ ఖాన్ చెప్పినట్లు నాకు కూడా అనిపిస్తుంది అని యానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.తను చేసిన పర్ఫామెన్స్ మజా అనిపించలేదు అంటూ ముమైత్ ఖాన్ తో పాటు యానీ మాస్టర్ కూడా అన్నారు.ఇలా వీరి స్పందలనను బట్టి యశ్ మాస్టర్ వారు ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటూ అనగా మా జడ్జిమెంట్ ను జడ్జ్ చేస్తున్నారా అంటూ ముమైత్ ఖాన్ కోపాన్ని చూపించింది.యానీ మాస్టర్ కూడా యశ్ మాస్టర్ పై విరుచుకు పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube