నేడు ఈడీ విచారణకు ముమైత్ ఖాన్.. కేసు ముందుకు జరగనుందా?

సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది.మనీ లాండరింగ్ కేసులో ముమ్మరంగా సాగుతున్న ఈ విచారణలో … ఈడీ ఒక్కొకరినీ కొన్ని గంటల పాటు ప్రశ్నిస్తోంది.

 Mumait Khan Is Coming To Ed Enquire-TeluguStop.com

ప్రముఖుల ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా సాగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ లోఇప్పటికే కొందరు సెలబ్రిటీలను ఈడీ విచారించింది.కెల్విన్ అనే డ్రగ్స్ సప్లయర్ ద్వారా బయటికి వచ్చిన ఈ కేసులో విస్తుగొలిపే సినీ ప్రముఖులు ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే కొందరు సినీ తారలు ఈడీ ముందుకు హాజరు అయ్యారు.అందులో ముఖ్యంగా… పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్, నందు, రానా, రవితేజ, నవదీప్ లు ఉన్నారు.

 Mumait Khan Is Coming To Ed Enquire-నేడు ఈడీ విచారణకు ముమైత్ ఖాన్.. కేసు ముందుకు జరగనుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా ఈ కేసులో ప్రముఖ నటీ ముమ్మైత్ ఖాన్ ఈరోజు ఈడీ ముందుకు హాజరు కానున్నారు.ఇక దర్యాప్తులో భాగంగా నేడు ముమైత్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, కెల్విన్ తో పరిచయాలు, మనీ లాండరింగ్ తదితర అంశాలపై ఈడీ… విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు సినీ తారలను విచారించిన ఈడీ అధికారులు సెప్టెంబర్ 17వ తేదీ నటుడు తనీష్, సెప్టెంబర్ 22వ తేదీన హీరో తరుణ్ విచారించానున్నట్లు తెలుస్తోంది.మనీలాండరింగ్ కింద పలువురు సినీ తారలకు సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు త్వరలోనే వారందరిని ఈ విషయంపై విచారణ చేపట్టనుంది.ఇందులో భాగంగానే నేడు ఈడీ అధికారులు ముందుకు వస్తున్న ముమైత్ ఖాన్ ను అధికారులు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తారు, కెల్విన్ తో ఆమెకు ఉన్న పరిచయాలు,అతనితో ముమైత్ ఖాన్ కు జరిగిన లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

#Rana #Tharun #Tanish #Mumait Khan #Enquire

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు