తెలంగాణ రాష్ట్రాన్నికి జనసేన పార్టీ నుంచి ప్రచార కార్యదర్శిగా ప్రముఖ నటుడు ములుకుంట్ల సాగర్ ( Mulukuntla Sagar )ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రకటించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సాగర్ మాట్లాడారు.
తనపై నమ్మకం ఉంచి ప్రచార కమిటీకి కార్యదర్శిగా నియమించినందుకు ఆయన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పోటీ చేయబోతున్న స్థానాల్లో మరో రెండు మూడు రోజుల్లో ప్రచారానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆయా నియోజకవర్గాల్లో బిజెపి నేతలు( BJP ) జనసేన నేతలని సమన్వయం చేసుకుంటూ ప్రచార నిర్వహిస్తామని తెలిపారు.ఎన్నికల్లో బిజెపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టోగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్తామని అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆంధ్రాలో కొనసాగుతుందని తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం జరుగుతుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఆయా తేదీలను ప్రకటిస్తామని అన్నారు.తెలంగాణలో తమ పార్టీ ప్రాథమిక దశలో ఉందని ఈ దశలో తాము బిజెపి( BJP )తో కలిసి పోటి చేస్తున్నామని ఆయన అన్నారు.
నియోజకవర్గం లో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రశ్నిస్తామని అన్నారు పెద్ద ఎత్తున యుతను జాగృతం చేస్తామని తెలిపారు.