అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..!!

కాంగ్రెస్ పార్టీ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు ప్రజల పట్ల ఎంతో శ్రద్ధతో వ్యవహరించే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా అస్వస్థతకు గురయ్యారు.ములుగు జిల్లా ఏటూరునాగారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.

 Mulugu Mla Sitakka Who Fell Ill Congress, Seethakka, Congress , Ts Congress , Ts-TeluguStop.com

నిర్వహించిన దళిత గిరిజన దండోరా పాదయాత్ర ర్యాలీలో దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచిన ఎమ్మెల్యే సీతక్క.సరిగ్గా తహసిల్దార్ కార్యాలయం దగ్గరకు వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయి అస్వస్థతకు గురయ్యారు.

ఈ క్రమంలో సీతక్క బీపీ లెవెల్స్ తగ్గడంతో.పూర్తిగా స్పృహ తప్పి పోయి కళ్ళు తిరిగి పడిపోయారు.దీంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జిల్లా కార్యకర్తలు మొత్తం అప్రమత్తమై ఎమ్మెల్యే సీతక్క నీ.ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించడం జరిగింది.వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తూ ఉన్నారు.ఇంకా సమాచారం ఏమీ బయటకు రాలేదు.ఈ క్రమంలో సీతక్క అభిమానులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలుఆమెకి ఏమి కాకూడదని.కోరుకుంటున్నారు.

తన నియోజకవర్గ ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసే ఎమ్మెల్యే అని.తాజాగా ఈ వార్త పై జనాలు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube