థియేటర్ లో MRPకంటే ఎక్కువ ధరకి అమ్మితే, ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి.!

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ప్రకారం మల్టీప్లెక్స్‌లు ఇంక సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన తినుబండారాలని ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు అని తీర్పుఇచ్చింది.ఈ తీర్పు ని తెలంగాణ ప్రభుత్వం స్పూర్తుగా తీసుకుని వాటిని తెలంగాణలో లో కూడా పాటించాలి అనే ఆలోచన లో ఉన్నారు .

 Multiplexes And Cinema Halls In Hyderabad Ordered To Sell Food Items At Mrp-TeluguStop.com

అయితే ఇక మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో.ఆహార పదార్థాల అమ్మకాల్లో దోపిడీ ఇక చెల్లదని సర్కారు హెచ్చరించింది.

అలా అమ్మినవారిపై కఠినచర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.సినిమా హాళ్లలో, మల్టీప్లెక్స్‌ల్లో ఆహారపదార్థాలను, నీళ్లడబ్బాలను బయట ధరల కంటే మూడు, నాలుగు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరల (ఎంఆర్‌పీ) కంటే ఎక్కువ ధరలకు అమ్మినా, ఆయా వస్తువుల పరిమాణం సరిగ్గా లేకపోయినా కఠినంగా వ్యవహరిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌సబర్వాల్‌ హెచ్చరించారు.భారీగా జరిమానా కూడా విదిస్తాం అని అన్నారు

మంగళవారం(జూలై-17) మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యజమానులతో అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.MRP కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతి పదార్థం బరువును స్పష్టంగా ప్రదర్శించాలి.కొనుగోలు చేసే ప్రతి పదార్థానికి బిల్లు తప్పనిసరి.

జూలై 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించిన స్టిక్కర్లు, అతికించుకోవచ్చన్నారు.సెప్టెంబర్ 1నుంచి పదార్థాలపై ఖచ్చితమైన ధర ముద్రించాలని యజమానులకు నిర్దేశించారు.

బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు.అధిక ధరలు వసూలు చేస్తే .వాట్సప్‌ నంబర్‌ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube