ముళ్ళపూడి వెంకటరమణ సర్వం కోల్పోవడం వెనక కృష్ణం రాజు ఎందుకు కారణం అయ్యాడు

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు సినిమాని ఎంత బాగా చూపించిన దానికి అనుగుణమైన కథ, స్క్రీన్ ప్లే,డైలాగ్స్ అందించే రచయిత లేకపోతే సినిమా అనేది నిలబడదు.సినిమా నిలబడాలంటే ఒక రచయిత అనేవాడు అహర్నిశలు కష్ట పడాల్సి ఉంటుంది ఆయన రాసుకున్న స్టోరీ దాంట్లో పాత్రలను ఊహించి రాసుకుంటూ పాత్రలకు జీవం పోసే రచయిత కావాలి అలాంటి రచయితలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నప్పటికీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన అందరిలా కాకుండా ఇంకో రకంగా ఉంటుంది.

 Mullampudi Venkataramana Lost All Properties Due To Krishnam Raju, Krishnam Raju-TeluguStop.com

ముళ్ళపూడి గారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ పెరిగారు సినిమాలో అవకాశం వచ్చినప్పుడు తన ఫ్రెండ్ అయినా బాపుని డైరెక్టర్ ను చేస్తూ తను ప్రొడ్యూసర్ గా మరి సాక్షి అనే సినిమాను తీశారు.బాపు సినిమాలన్నింటికి ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా ఉన్నాడు .

ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు చేత చెప్పించిన డైలాగులు ఇప్పటికీ మనందరం నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం అలాంటి గుర్తుండిపోయే సంభాషణలు రాసిన గొప్ప వ్యక్తి ముళ్లపూడి రమణ గారు ఆయన రాసిన అన్ని పాత్రల్లో అప్పుల అప్పారావు అనే పాత్ర మాత్రం మన అందరికీ గుర్తుండిపోతుంది ఎందుకంటే అప్పు తీసుకున్న వారికి తెలుస్తుంది దాని కట్టలేక పోయినప్పుడు ఎంత బాధ పడతాడు అనేది మన కళ్ళకి కట్టినట్టుగా చూపించారు రమణగారు.అలాంటి ఎన్నో పాత్రలకు జీవం పోసిన రచయిత ముళ్ళపూడి రమణ గారు.

రామాయణంలోని ఒక్కొక్క కాండాన్ని ఒక సినిమాగా తీయొచ్చు అని చెప్పి రాసి చూపించిన గొప్ప వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ గారు.బాపు గారు ముళ్లపూడి వెంకటరమణ గారు ఏ కల్మషం లేని మంచి ఫ్రెండ్స్ వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గా ఉన్న చాలా మందికి ఇన్స్పిరేషన్ బాపు రమణ అనే పేర్లు రెండు కాదు ఒకటి అని చాలా సార్లు వాళ్ళు సభాముఖంగా చెప్పారు చూసే వాళ్ళు కూడా బాపు-రమణలు అంటే ఒక్కరే అని అనుకుంటారు అని కూడా చెప్పారు అలా ఉంటారు వాళ్ళు.

Telugu Balakrishna, Bapu, Krishnam Raju, Nayanatara, Ramayana, Sneha, Srikanth-T

రమణ గారు స్టోరీలు రాయడం బాబు గారు తీయడం వీళ్ల దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనేది ఆ రోజుల్లో కామన్ గా జరుగుతూ ఉండేది అలా చాలా సినిమాలు వచ్చాయి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అయ్యాయి.రమణ గారు రాధా గోపాలం అనే ఒక భార్య భర్తల మధ్య ఉండే స్టొరీ ని రాసి ఇ దాన్ని ని బాపు గారితో చెప్పి సినిమా చేశారు ఆ సినిమాలో శ్రీకాంత్ హీరో , స్నేహ హీరోయిన్ కాగా ఇప్పుడు స్టార్ హీరో గా వెలుగొందుతున్న నాని అప్పుడు బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.రమణ గారు సుందరకాండ అనే స్టోరీ కూడా డీసెంట్ గా రాసి బాపు గారితో చేయించి హిట్ కొట్టాడు.బాపు రామాయణానికి సంబంధించిన సినిమా బాలకృష్ణ హీరోగా నయనతార హీరోయిన్ గా చేద్దాం అనుకున్నప్పుడు ముళ్ళపూడి రమణ శ్రీ రామ రాజ్యం అనే ఒక మంచి స్టోరీ ఇచ్చారు.

ఆ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అయింది.కానీ హిట్ ని చూడడానికి రమణగారు లేకుండా పోయారు ఆయన మరణంతో మంచి ఫ్రెండ్ ని కోల్పోయిన బాపు గారు కొంతవరకు మానసికంగా కుంగిపోయారు అనే చెప్పాలి.

Telugu Balakrishna, Bapu, Krishnam Raju, Nayanatara, Ramayana, Sneha, Srikanth-T

కృష్ణంరాజు హిందీలో సినిమాని ప్రొడ్యూస్ చేయగా ఆ సినిమా ఫైనాన్సియర్స్ కి హామీగా ఉన్నారు రమణ గారు ఆ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అవడంతో ఫైనాన్షియర్స్ కి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ముళ్లపూడి రమణ గారి మీద పడింది వాళ్ళు హామీగా ఉన్న ముళ్లపూడి గారిని అడగడం తో రమణ గారు కృష్ణంరాజు గారిని అడిగితే ఆయన పట్టించుకునేవారు కాదు దీంతో ఏం చేయాలో తెలియక ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళతో కూడా కృష్ణంరాజు గారిని అడిగితే కృష్ణంరాజు దానికి ఫీల్ అయి అందరి ముందు నా పరువు తీస్తావా అని కృష్ణంరాజు గారు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని తేల్చి చెప్పేశారు దీంతో చేసేది లేక తన సొంత ఇల్లు అమ్మేసి ఫైనాన్సు డబ్బులు కట్టేసారు ముళ్ళపూడి వెంకటరమణ గారు దీంతో ఎక్కడ ఉండాలో తెలియకపోతే తన ఆప్తమిత్రుడైన బాపు తన ఇంటిపైనే ఉండమని చెప్పారు.

Telugu Balakrishna, Bapu, Krishnam Raju, Nayanatara, Ramayana, Sneha, Srikanth-T

ఇలా ముళ్ళపూడి వెంకటరమణ గారి లైఫ్ మొత్తం కష్టాలు కన్నీళ్లు తో నిండిపోయింది కానీ ఆయన కలంలో నుంచి వచ్చిన ప్రతి మాట మనందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు మంచి రచయితగా మిగిలిపోయాడు ఎంత మంది రచయితలు ఉన్నప్పటికీ ఆయన స్థాయి వేరు అనే చెప్పాలి.ముళ్ళపూడి వెంకటరమణ గారి కొడుకు వర ముళ్ళపూడి కూడా దర్శకుడే జూనియర్ ఎన్టీఆర్ తో నా అల్లుడు అనే సినిమాని డైరెక్ట్ చేశాడు.ప్రస్తుతం సీరియల్స్ కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube