చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యుల ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు మరోసారి ములాఖత్ అయ్యారు.ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలిశారు.

 Mulakat Of Family Members With Chandrababu Once Again-TeluguStop.com

అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు మాట్లాడారు.

అయితే గత వారం కూడా చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు మరోసారి ములాఖత్ కు దరఖాస్తు చేసుకోగా అధికారులు నిరాకరించిన సంగతి తెలిసిందే.ఈ వారంలో మొదటి రోజే ములాఖత్ కు దరఖాస్తు చేసుకోగా అనుమతి రావడంతో భువనేశ్వరి చంద్రబాబును కలిశారని తెలుస్తోంది.

మరోవైపు ములాఖత్ కు ముందు రాజమండ్రి నాళం భీమరాజు వీధి వినాయక ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube