శ్రీముఖి నిజస్వరూపం బయటపెట్టిన అవినాష్.. ఆమె వల్లే ఏడుస్తూ?

బుల్లితెర యాంకర్ శ్రీముఖి టాలెంటెడ్ యాంకర్ అనే సంగతి తెలిసిందే.ఏ షోలో పాల్గొన్నా, ఏ ఈవెంట్ లో పాల్గొన్నా శ్రీముఖి తన టైమింగ్ తో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

 Mukku Avinash Shocking Comments On Anchor Sreemukhi-TeluguStop.com

మరోవైపు జబర్దస్త్ షో ద్వారా అవినాష్ పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.తాజాగా ఒక షోలో అవినాష్ శ్రీముఖి నిజస్వరూపం బయటపెట్టారు.

శ్రీముఖి గొప్పదనం చెబుతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెబుతూ కారణాలను కూడా అవినాష్ వెల్లడించారు.

 Mukku Avinash Shocking Comments On Anchor Sreemukhi-శ్రీముఖి నిజస్వరూపం బయటపెట్టిన అవినాష్.. ఆమె వల్లే ఏడుస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Avinash, Comedy Stars Show, Srimukhi, Srimukhi Reality-Movie

ముక్కు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా అవినాష్ జాతకమే మారిపోయింది.అవినాష్ చేసిన స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టీమ్ లీడర్ స్థాయికి అవినాష్ ఎదిగారు.కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ షోకు 10 లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ షో విన్నర్ అవుతానని అవినాష్ భావించినా టాప్ 5 జాబితాలో చేరలేకపోయారు.

బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ బెస్ట్ ఎంటర్టైనర్ అనే పేరును కూడా తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ వరుస షోలతో బిజీగా ఉండటంతో పాటు ఆ షోల ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.తాజాగా కామెడీ స్టార్స్ షోలో రాములమ్మ గెటప్ వేసుకుని అవినాష్ సందడి చేశారు.

ఆ పాత్రలో నవ్వించిన అవినాష్ శ్రీముఖి పాత్ర గురించి ఎమోషనల్ అయ్యారు.

Telugu Avinash, Comedy Stars Show, Srimukhi, Srimukhi Reality-Movie

ఒకానొక సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని తల్లిదండ్రుల ఆపరేషన్ కు డబ్బులు అవసరం కావడంతో పాటు బిగ్ బాస్ షోతో పాటు ఇతర ఆఫర్లు వచ్చాయని ఆ సమయంలో శ్రీముఖి డబ్బులు ఇచ్చిందని అవినాష్ శ్రీముఖి నిజస్వరూపం బయటపెట్టారు.శ్రీముఖి చేసిన సాయం గురించి తెలిసి నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

#Srimukhi #Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు