ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్.. వధువు ఎంత అందంగా ఉందొ?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా నిలిచిన ముక్కు అవినాష్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 Mukku Avinash Got Engaged, Avinash Engagement Photos, Avinash Weds Anuja, Avinas-TeluguStop.com

అతి తక్కువ సమయంలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.జబర్దస్త్ కు ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన అవినాష్.

ఇక అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి సెలబ్రేట్ హోదాను అందుకున్నాడు.ఇదిలా ఉంటే త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అవినాష్.

జబర్దస్త్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న అవినాష్ ​వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.ఇక బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కు దూరమైన అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో మరింత పరిచయాలు పెంచుకున్నాడు.కానీ కొన్ని విమర్శల వల్ల షో నుండి తక్కువ సమయంలో బయటకు వచ్చాడు.ఇక ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో చేస్తున్నాడు.

ఇక అవినాష్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు అర్థమవుతుంది.ఇక ఫోటోలను పంచుకుంటూ.జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏమాత్రం వెయిట్ చేయవద్దు అని.అందుకు తమ ఫ్యామిలీలు కలుస్తాయని.తాము కూడా కలవడంతో వెంటనే ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపారు.

అందరు ఎప్పటినుండో పెళ్లి ఎప్పుడు అని అడిగే వారిని.ఇక తను త్వరలో తన అనూజతో పెళ్లి చేసుకోబోతున్నానని.మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు.ఇక ఇందులో అవినాష్ చేసుకునే అమ్మాయి పేరు అనూజ అని తెలపగా.

అమ్మాయి చూడటానికి ఎంతో అందంగా ఉంది.ఇక ప్రస్తుతం అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారగా బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube