ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ హరినామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయాలు..!

Mukkoti Ekadashi Temples Teeming With Devotees

నేడు ముక్కోటి ఏకాదశి కావడంతో రాష్ట్రంలోని పలు వైష్ణవాలయాలలో పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి.వేకువజామున నుంచి శ్రీహరి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసుకుంటున్నారు.

 Mukkoti Ekadashi Temples Teeming With Devotees-TeluguStop.com

పురాణాల ప్రకారం ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు మూడు కోట్లమంది దేవతలతో కలిసి భూమిపైకి వస్తారని అందుకే నేడు శ్రీహరి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే నేడు వేకువజామున  నుంచి ఎంతో మంది భక్తులు వివిధ ఆలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారు.

 Mukkoti Ekadashi Temples Teeming With Devotees-ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ హరినామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ స్వామి వారి ఆలయానికి చేరుకోవడంతో ప్రతి ఒక్క ఆలయం శ్రీ హరినామ స్మరణలతో మార్మోగిపోతున్నాయి.సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి  ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.

ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వల్ల మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని భావిస్తారు.ఈ క్రమంలోనే భక్తులు ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.అదే విధంగా ఎంతో మంది భక్తులు నేడు కఠిన ఉపవాసంతో స్వామివారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు.ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు.

ఈ క్రమంలోనే తిరుమల గిరులు గోవింద నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి.

Video : Mukkoti Ekadashi Temples Teeming With Devotees Mukkoti Ekadashi, Temples, Sri Maha Vishnuvu, Pooja

#Temples #Pooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube