జబర్దస్త్‌ కు రూ.10 లక్షల ఫైన్‌ కట్టి బిగ్‌బాస్‌ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్‌  

Mukhu Avinash Pay The 10 Lakhs Ruppes Fine To Jabardasth The Reason Is... Mukhu Avinash, Jabardasth, Telugu Big Boss 4, Wild Card Entry, - Telugu Jabardasth, Mukhu Avinash, Telugu Big Boss 4, Wild Card Entry

బిగ్‌ బాస్‌ లో ఈసారి జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ ఉంటాడు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఆ విషయం ఫై షో ప్రారంభం రోజు క్లారిటీ వచ్చింది.

TeluguStop.com - Mukhu Avinash Pay The 10 Lakhs Ruppes Fine To Jabardasth The Reason Is

అవినాష్‌ ఉంటాడు అనుకున్నది అంతా కూడా పుకార్లే అంటూ అంతా అనుకున్నారు.అయితే షో మూడు నాలుగు రోజులు పూర్తి అయినప్పటి నుండి కూడా కుమార్‌ సాయి మరియు అవినాష్‌ లు షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మొదటి వారం అయిన తర్వాత బిగ్‌బాస్‌ లోకి కుమార్‌ సాయి ఒక్కడే ఎంట్రీ ఇచ్చాడు.ఆ సమయంలో కూడా అవినాష్‌ ఉండక పోవచ్చు అన్నారు.

TeluguStop.com - జబర్దస్త్‌ కు రూ.10 లక్షల ఫైన్‌ కట్టి బిగ్‌బాస్‌ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాని ఎట్టకేలకు నిన్నటి ఎపిసోడ్‌లో అవినాష్‌ ఎంట్రీ ఇచ్చేశాడు.అనూహ్యంగా బిగ్‌బాస్‌ లో జోకర్‌ ని అంటూ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌ కు మంచి వెల్‌ కమ్‌ దక్కింది.

జబర్దస్త్‌ కామెడీ షో తో అవినాష్‌ కు మంచి గుర్తింపు దక్కింది.ఆ కామెడీ షో తో అవినాష్‌ కు ఒప్పందం ఉంది.ఆ ఒప్పందం ప్రకారం ఇతర షోలకు వెళ్ల కూడదు.మద్యలో కామెడీ షోను వదిలి పెట్టకూడదు.ఆ విషయంలో ఒప్పందం ఉన్న కారణంగా బిగ్‌బాస్‌ కోసం ఏకంగా రూ.10 లక్షలు చెల్లించి మరీ బిగ్‌బాస్‌కు వచ్చాడట.వారంలో అయిదు లక్షల రూపాయల పారితోషికంను బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇస్తారని తెలుస్తోంది.అందుకే ముక్కు అవినాష్‌ ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉంటాను అనే నమ్మకంతో వచ్చాడు.కనీసం పది వారాలు ఉన్నా కూడా 50 లక్షలు వస్తాయి.కనుక జబర్దస్త్‌ కు 10 లక్షలు చెల్లించడం పెద్ద సమస్య కాదు అనుకున్నాడేమో.

అందుకే మల్లెమాల వారికి ఆ మొత్తం ఫైన్‌ చెల్లించి ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడు.ఒక వేళ బిగ్‌బాస్‌ నుండి వెంటనే ఎలిమినేట్‌ అయినా కూడా ఆయనకు జబర్దస్త్‌లో మళ్లీ ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుంది.

అందుకే ఎలాంటి డౌట్‌ లేకుండా మల్లె మాల వారితో ఒప్పందం చేసుకుని ముక్కు అవినాష్‌ బిగ్‌బాస్‌ లో ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు.

#Mukhu Avinash #Jabardasth #Wild Card Entry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mukhu Avinash Pay The 10 Lakhs Ruppes Fine To Jabardasth The Reason Is Related Telugu News,Photos/Pics,Images..