అంబానీ కొడుకు పెళ్లి శుభలేఖ ఎన్ని లక్షల్లో తెలుసా.? ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు.!     2018-06-08   23:42:41  IST  Raghu V

గత కొద్ది నెల‌ల క్రితం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తన కూతురి పెళ్లిని రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టి జ‌రిపించాడు క‌దా. అప్ప‌ట్లో ఆ వార్త ప్ర‌ముఖంగా నిలిచింది. ఓ ద‌శ‌లో ఐటీ అధికారులు సోదాలు కూడా చేశారు. అంత డ‌బ్బుతో ఎలా పెళ్లి చేశారు ? ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ? అంటూ వారు సోదాలు నిర్వ‌హించారు. అంత‌టితో ఆ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. కానీ.. ఇప్పుడు అది కాదు, ఆ పెళ్లిని త‌ల‌ద‌న్నే పెళ్లి మ‌రొక‌టి జ‌ర‌గ‌నున్న‌ది. అది ఎవ‌రి పెళ్లో తెలుసా..? ఇంకెవ‌రిది.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ కుమారుడిది. త్వ‌ర‌లోనే ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ట‌.

ఆకాశ్‌, శ్లోక- ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. రస్సెల్‌ మెహతా అధిపతిగా ఉన్న ‘రోజీ బ్లూ’… ప్రపంచంలో అతి పెద్ద వజ్రాభరణాల సంస్థ. బెల్జియం కేంద్రంగా నడుస్తున్న రోజీ బ్లూ… 50 ఏళ్ల క్రితం బి.అరుణ్‌కుమార్‌ పేరిట వ్యాపారం ప్రారంభించింది. 1973లో దిలీప్‌ మెహతా సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడానికి అడుగులు వేసింది. రోజీ బ్లూకు ఒరా పేరిట మన దేశంలో సుమారు 30 దుకాణాలు ఉన్నాయి.రస్సెల్‌, మోనా మెహతా ముగ్గురు పిల్లల్లో శ్లోక ఆఖరి సంతానం..అంబానీ, మెహతా కుటుంబాలు ఒకరికొకరు బాగా పరిచయస్థులే..ముకేశ్‌ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్‌ అధిపతి రస్సెల్‌ మెహతా వియ్యంకులు కాబోతున్నారు.