నిందితుడి అభ్యర్ధనను తిరస్కరించిన రాష్ట్రపతి,మరి ఉరి ఎప్పుడో

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో నిందితులు అయిన నలుగురికి ఇటీవల పటియాలా కోర్టు ఉరిశిక్షలను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.

 Mukesh Singh Pawan Guptha Vinay Sharma Ramnath Kovind-TeluguStop.com

ఈ నెల 22 న వారికి ఉరిశిక్ష అమలుచేయాలి అంటూ తీర్పు వెల్లడించింది.దీనితో తీహార్ జైలు అధికారులు మాస్ ఉరి పనులను కూడా చేపట్టారు.

ఈ క్రమంలో నిందితులకు క్షమాభిక్ష పెట్టుకొనే అవకాశం ఢిల్లీ ప్రభుత్వం కల్పించడం తో ఈ కేసులో ఒక నిందితుడు ఆయిన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతి కి క్షమాభిక్ష అభ్యర్ధన పెట్టుకున్నాడు.అయితే ముఖేష్ అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు.

ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించిన నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ నిందితుడి క్షమాభిక్షను తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే.

అయితే అతడి క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది.కారాగార నిబంధనల ప్రకారం ఏదైనా ఒకే కేసుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పుడు నిందితుల్లో ఒకరు క్షమాభిక్ష కు దరఖాస్తు చేసుకుంటే అది తేలే వరకు మిగిలిన వారికి కూడా శిక్ష అమలు చేయడానికి అవకాశం ఉండదు.

Telugu Mukesh Singh, Pawan Guptha, Ramnath Kovind, Telugu Ups, Vinay Sharma-Gene

ఒక్కరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా అది తేలే వరకు శిక్ష అమలు చేయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొనడం తో నిర్భయ దోషులను ఉరిశిక్షపై కొంత సందిగ్ధత ఏర్పడింది.అయితే కేంద్రహోం శాఖ ఆ అభ్యర్ధనను తిరస్కరించమని రాష్ట్రపతి ని కోరడం తో తాజాగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని ప్రకటించారు.దీనితో ఇప్పుడు వారి ఉరిశిక్ష ఎప్పుడు అమలు అవుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.రాష్ట్రపతి సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు.‘‘చాలా మంచి విషయం.ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త మా ఆశలను ఆవిరి చేసింది’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube