నిర్భయ దోషుల మరో పిటీషన్,ఉరిశిక్ష పై సందిగ్ధం

Mukesh Sing Akshay Takur Vinai Sharma

ఫిబ్రవరి 1 వ తారీఖున నిర్భయ దోషులను ఉరితీయాలి అంటూ పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఉరి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు నిర్భయ దోషులు.

 Mukesh Sing Akshay Takur Vinai Sharma-TeluguStop.com

శిక్షను ఆలస్యం చేసేందుకు వివిధరకాల దారులు వెతుక్కుంటున్నారు.చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకునేందుకు చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే క్యూరేటివ్‌, మెర్సీ, రివ్యూ పిటిషన్లతో కాలయాపన చేసిన నిందితులు ఇప్పుడు తాజాగా అక్షయ్‌ ఠాకూర్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌, వినయ్‌ శర్మ క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నారు.

అక్షయ్‌ పిటిషన్‌పై సుప్రీంలో మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరగనుంది.

జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వాదనలు విననుంది.పటియాలా కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేసిన తరువాత నిర్భయ నిందితులు మాత్రం వరుస పిటీషన్ లతో కాలయాపన చేస్తున్నారు.

అంతేకాకుండా ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాలన్న వారెంట్లపై కూడా స్టే కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.నలుగురు దోషుల న్యాయ అవకాశాలు పూర్తయ్యే వరకు డెత్‌ వారెంట్లు ఇవ్వొద్దంటూ పిటీషన్ లో విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు విచారించనుంది పటియాలా హౌస్‌ కోర్టు.మరోపక్క వినయ్‌ శర్మ మెర్సీ పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.రాష్ట్రపతి క్షమాభిక్ష అర్జీని తిరస్కరించినా.నిబంధనల ప్రకారం 14 రోజుల తర్వాతే ఉరిశిక్ష అమలుచేయాల్సి ఉంటుంది.అలాగే ఒకే నేరంలో దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుంది.దీనితో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు అవుతుందో లేదో అన్న సందిగ్ధత ఏర్పడింది.

#Vinai Sharma #Mukesh #Akshay Takur #Pawan Gupta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube