కలహరణం కోసం మరో ఎత్తుగడ, సుప్రీం మెట్లు ఎక్కిన నిర్భయ నిందితుడు  

Mukesh Kumar Singh Challenges Rejection Of Mercy Rejectin-nirbhaya Convict,rejection Of Mercy Rejection,supreme Court,ముకేశ్ కుమార్

ఒకపక్క ఉరిశిక్ష అమలు దగ్గర పడుతుంటే మరో పక్క దానిని ఏ రకంగా జాప్యం చేయాలి అన్నట్లుగా నిర్భయ నిందితులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారి తీస్తుంది.మొన్నటికి మొన్న నిర్భయ దోషులు అయిన పవన్ గుప్తా,వినయ్ శర్మ,అక్షయ్ సింగ్ ల మెర్సీ,క్షమాభిక్ష పిటీషన్ ల విషయంలో తీహార్ జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల టైం కి పిటీషన్ లు దాఖలు చేయలేకపోయారు అంటూ కోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Mukesh Kumar Singh Challenges Rejection Of Mercy Rejectin-Nirbhaya Convict Rejection Supreme Court ముకేశ్ కుమార్

అయితే ఈ పిటీషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించడం తో ఇక వారికి ఉరిశిక్ష ఖాయం అనుకంటున్న సమయంలో ఇప్పుడు తాజాగా నిర్భయ నిందితుల్లో ఒకరైన ముకేశ్ కుమార్ న్యాయవాది సుప్రీం కోర్టు లో మరో పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం.

క్షమాభిక్ష కోసం తాను చేసుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించడంపై జ్యుడీషియల్‌ సమీక్ష జరపాలంటూ ముకేశ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వృందా గ్రోవర్‌ శనివారం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.ముకేశ్‌తోపాటు మరో ముగ్గురు దోషులు పవన్‌గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్‌సింగ్‌లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉన్న ఈ సమయంలో ఇప్పుడు ఇలాంటి పిటీషన్ దాఖలు చేసి కలహరణం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Mukesh Kumar Singh Challenges Rejection Of Mercy Rejectin-nirbhaya Convict,rejection Of Mercy Rejection,supreme Court,ముకేశ్ కుమార్ Related....