దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న ముఖేష్ అంబానీ కొడుకు .. ఖరీదు ఎంతో తెలుసా..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఏం చేసినా జనం ఆసక్తిగా గమనిస్తారు.ఆయన ఇంట్లో శుభకార్యాలు, వ్యాపార విశేషాలు, అంబానీ లైఫ్‌స్టైల్ ఇలా అన్నింటిపైనా ప్రజలు మక్కువ చూపుతారు.

 Mukesh Ambanis Youngest Son Anant Ambani Buys Costliest Home In Dubai , Mukesh A-TeluguStop.com

ఇక ప్రస్తుత విషయంలోకి వెళితే.ఎడారి నగరం దుబాయ్‌లో అత్యంత విలువైన విల్లాను ముఖేష్ అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది.

సముద్రానికి అత్యంత సమీపంలో, ఆహ్లాదకరంగా వుండే వాతావరణంలో వున్న విల్లాను ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.దీని విలువ 80 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.640 కోట్లు)గా సమాచారం.దుబాయ్‌లో మానవ నిర్మిత దీవి పామ్ జుమేరా వద్ద వున్న ఈ విలాసవంతమైన విల్లాలో పది బెడ్ రూమ్స్, ప్రైవేట్ స్పా, ఇండోర్, ఔట్‌డోర్ ఫూల్స్ వంటివి వున్నాయట.

ఇకపోతే.దుబాయ్‌లోని అంబానీ ఇంటికి ఇరుగుపొరుగుగా వున్న వారు కూడా సాధారణ వ్యక్తులు కాదు.బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెఖమ్, ఆయన భార్య విక్టోరియా, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌లు గతంలోనే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేశారు.ప్రపంచంలో వాణిజ్యానికి డెస్టినేషన్‌గా వున్న దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు విదేశీయులకు కఠినమైన నిబంధనలు అడ్డుగా నిలిచేవి.

అయితే ఇటీవల ప్రభుత్వం ఈ రూల్స్‌ని సడలించింది.అంతేకాదు ఇక్కడే శాశ్వతంగా వుండేందుకు గోల్డెన్ వీసాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.

కోవిడ్ తర్వాత దుబాయ్‌ని సైతం ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అక్కడి ప్రభుత్వం సంస్కరణల బాట పట్టింది.దీనిలో భాగంగా 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఆస్తిని ఎవరైనా విదేశీయులు కొనుగోలు చేస్తే.

వారికి పదేళ్ల వీసా ఇస్తోంది.

Telugu Anant Ambani, Bollywoodshah, David Beckham, Dubai, Mukesh Ambanis, Mukesh

ఇప్పటికే బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన స్టోక్ పార్క్ ఎస్టేట్‌నీ కొనుగోలు చేశారు అంబానీ.ఒకానొక దశలో ఆయన కుటుంబం లండన్‌కు మకాం మార్చబోతోందని ప్రచారం జరిగింది.అయితే దీనిని రిలయన్స్ ఖండించింది.

హాస్పిటాలిటీ రంగంలో వున్న అవకాశాలను చేజిక్కించుకునేందుకే ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు తప్పించి.అంబానీ కుటుంబం  భారత్‌ను వీడిపోదని వెల్లడించింది.

ఆ తర్వాత అమెరికాలో అత్యంత ఖరీదైన హోటల్‌లో ఒకటిగా పేరుగాంచిన న్యూయార్క్‌లోని ‘‘మాండరిన్ ఓరియంటల్’’ అనే లగ్జరీ హోటల్‌ను అంబానీ కొనుగోలు చేశారు.ఈ డీల్ విలువ 98 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.736 కోట్లు) వుంటుందని అంచనా.మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌’ హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

కొలంబస్‌ సెంటర్‌ కార్పొరేషన్‌(కేమాన్‌) నుంచి షేరు మూలధనాన్ని ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేస్తుంది.2003లో ఏర్పాటైన మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.విశిష్ట సేవలకు గాను పలు అవార్డులను కూడా ఇది సొంతం చేసుకుంది.

నేచురల్‌ సెంట్రల్ పార్క్, కొలంబస్ సర్కిల్‌కు నేరుగా ఆనుకుని ఉండటంతో టూరిస్ట్‌లను ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube