ముఖేష్ అంబానీ విజయం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

ముఖేష్ అంబానీ.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Manoj Modi Secret Behind Mukesh Ambani Success, Mukesh Ambani, Anil Ambani, Mano-TeluguStop.com

ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 5 స్థానంలో ఉన్నారు.టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఏకైక వ్యక్తి ముఖేష్ అంబానీ.

అలాంటి ఈ కుబేరుడు బిజినెస్ సీక్రెట్ ఏంటి? ఇతడి బిజినెస్ కి సంబంధించిన వ్యూహకర్త ఎవరు? అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా?

ముఖేష్ అంబానీ సొంత అన్నయ అప్పులపాలయ్యాడు.ముఖేష్ మాత్రం కుబేరుడు అయ్యాడు.

వీళ్ళ ఇద్దరిది అదృష్టం దురదృష్టం అని సరిపెట్టుకున్నప్పటికి ముఖేష్ అంబానీ అంత పెద్ద కుబేరుడు అవ్వడానికి మాత్రం ఓ వ్యక్తి ఉన్నాడు.అతడే మనోజ్ మోడీ.బయట ప్రపంచానికి అతడు ఎవరో తెలియకపోయినప్పటికి రిలయన్స్ ఇండస్ట్రీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఇతడు ఒకడట.

రిలయన్స్ రిటైల్ తో పాటు, రిలయన్స్ జియో ఇన్ఫో కమ్ డైరెక్టర్ గా మనోజ్ మోడీ వ్యవహరిస్తున్నాడు.

ధీరూబాయ్ అంబానీ పెట్రో కమ్ ప్రారంభించిన సమయం నుంచి అతను కంపెనీలో ఉన్నాడట.ఇక అతడి సలహాలతో రిలియన్స్ ఎన్నో స్టార్ట్ అప్ కంపెనీలను కొనేసిందట.2010లో ఎయిర్ డెక్కెన్ కొనేసమయంలో కూడా మనోజ్ మోడీ కీలక పాత్ర వహించారట.

కంపెనీ విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయన ఒక్క మీటింగ్ పెడితే చాలట.

ఆ సమస్య నుంచి బయటపడినట్టేనట.ఇంకా అతను ఎవరితో మాట్లాడిన చాలా తక్కువగా మాట్లాడి పని చేయించుకుంటారట.

సిబ్బంది ఎలా పని చేయాలి. కీలక బాధ్యతలు ఎలా నిర్వహించాలి అనేది మాత్రమే మనోజ్ మోడీ శిక్షణ ఇస్తారట.

ఇలా రిలియన్స్ కంపెనీ సక్సెస్ కి ఇతడు కూడా ఒక కారణమేనని కొందరు నిపుణులు చెప్తున్నారు.ఏది ఏమైనా ముఖేష్ అంబానీకి అదృష్టం ఓ రేంజ్ లో ఉంది.

మరి మీరు ఏం అంటారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube