అంబానీ కూతురు వెడ్డింగ్ కార్డు చూస్తే అదరహో అనాల్సిందే.! ఒక్కోటి ఎన్ని వేలో తెలుసా.?   Mukesh Ambani Nita Ambani Daughter Isha Ambani Wedding Card     2018-11-10   08:27:20  IST  Sainath G

గత కొద్ది నెల‌ల క్రితం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తన కూతురి పెళ్లిని రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టి జ‌రిపించాడు క‌దా. అప్ప‌ట్లో ఆ వార్త ప్ర‌ముఖంగా నిలిచింది. ఓ ద‌శ‌లో ఐటీ అధికారులు సోదాలు కూడా చేశారు. అంత డ‌బ్బుతో ఎలా పెళ్లి చేశారు ? ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ? అంటూ వారు సోదాలు నిర్వ‌హించారు. అంత‌టితో ఆ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. కానీ.. ఇప్పుడు అది కాదు, ఆ పెళ్లిని త‌ల‌ద‌న్నే పెళ్లి మ‌రొక‌టి జ‌ర‌గ‌నున్న‌ది. అది ఎవ‌రి పెళ్లో తెలుసా..? ఇంకెవ‌రిది.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీది.

మరికొన్ని రోజుల్లోనే పెళ్లి వేడుక ఉండడంతో…ముఖేష్‌ కూతురి పెళ్లి వేడుక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా అత్యంత ఖర్చుతో కూడుకున్న వెడ్డింగ్‌ కార్డును అంబానీ కుటుంబం రిలీజ్‌ చేసింది.మామూలుగా పెళ్లి కార్డును కార్డు రూపంలో తయారు చేసి బంధు మిత్రులకు ఇస్తాం. కానీ ముఖేష్‌ అంబాని గారాల పట్టి పెళ్లి కార్డు కోసం ఏకంగా ఓ పెట్టెనే రూపొందించారు.

Mukesh Ambani Nita Daughter Isha Wedding Card-

బంగారం పూతతో కూడిన పెట్టె ఓపెన్‌ చేసి చూస్తే లక్ష్మీదేవి చిత్రపటంతో రూపొందించిన పెళ్లికార్డు దర్శనమిస్తుంది. కలర్‌ఫుల్‌గా రూపొందించిన ఈ పెళ్లి కార్డు ఆకట్టుకుంటోంది.అత్యంత రాయల్‌ లుక్‌తో రూపొందించిన ఈ వెడ్డింగ్‌ కార్డు ఖరీదు విలువ ఒక్కొక్కటీ 50 వేల రూపాయలపైనే ఉంటుందని సమాచారం. డిసెంబరు 12న ఈషా పెళ్లి పిరమాల్‌ గ్రూప్‌ అధినేత అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌తో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి.

Mukesh Ambani Nita Daughter Isha Wedding Card-

గత సెప్టెంబర్‌ నెలలోనే ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్‌ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇటలీ నది తీరంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక కళ్లు జిగేల్‌ మనేలా జరిగింది.