బాబోయ్.. గంటకు అంబానీ అంత సంపాదిస్తున్నాడా?

దేశంలో ముకేశ్ అంబానీ గురించి తెలియని వాళ్లు దాదాపుగా ఉండరు.కరోనా, లాక్ డౌన్ సమయంలో దేశంలోని అన్ని రంగాలు తీవ్ర నష్టాలపాలైనా ముకేశ్ అంబానీ సంపద మాత్రం భారీగా పెరగడం గమనార్హం.

 Mukesh Ambani Earnerd Rs 90 Crore Every Hour Lockdown , India, Hurun Rich List,-TeluguStop.com

హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020 ఏడాది కాలంలో ముకేశ్ అంబానీ సంపద 6,58,000 కోట్ల రూపాయలకు చేరినట్టు వెల్లడించింది.సంవత్సరం వ్యవధిలో ముకేశ్ సంపద ఏకంగా 73 శాతం పెరగడం గమనార్హం.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ ఉండగా ఈ సంవత్సరం కూడా ముకేశ్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుని తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.తొలి స్థానంలో ఉన్న ముకేశ్ సంపాదన 6 లక్షల కోట్లకు పైగా ఉంటే రెండో స్థానంలో ఉన్న హిందూజా సంపద మాత్రం 1,43,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉండటంతో రాబోయే సంవత్సరాల్లో ముకేశ్ కే నంబర్ 1 స్థానం సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ గత ఏడాది కాలంలో రిలయన్స్ జియో, రిటైల్ విక్రయాల్లో వాటాలను విక్రయించింది.

భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ భారీగా పెరగడం గమనార్హం.భారత్ లో తొలి స్థానంలో నిలిచిన అంబానీ ప్రపంచంలోనే టాప్ 5 స్థానంలో నిలిచారు.

హురూన్‌ ఆగష్టు నెల 31 నాటికి భారత్ లో 1000 కోట్ల రూపాయలకు పైగా సంపద కలిగిన 828 మందిని గుర్తించింది.

ఈ నివేదికల ప్రకారం లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ముకేశ్ అంబానీ గంటకు 90 కోట్ల రూపాయల చొప్పున సంపాదించారని తేలింది.

ముకేశ్ అంబానీ సంపాదన తెలిసి అవాక్కవడం భారతీయుల వంతవుతోంది.ఇకపోతే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1,41,000 కోట్ల రూపాయల సంపదతో మూడో స్థానంలో ఉండగా అదానీ గ్రూపు 1,40,000 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉంది.

అత్యంత సంపన్నుల జాబితాలో రెండు, మూడు, నాలుగు స్థానాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube