ముకేశ్ అంబానీ సముద్ర భవనం గురించి తెలిస్తే షాక్ అవుతారు, ఇంతకీ ఎంత ఖర్చు అయిందంటే     2018-06-14   00:11:02  IST  Raghu V

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు మన దేశంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ అయన వ్యాపారం నుంచి వ్యక్తిగత విషయాలు ఏమి చేసిన కొత్తగా ఎవరు చేయని విదంగా ఉంటుంది. అందులో ఒక వ్యూహం ఉంటుంది, ముందుచూపు ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, కొత్తదనం ఉంటుంది.

ముంబై లో నిర్మించిన అత్యంత విలాసమైన భవనం

ముంబైలో అతను నిర్మించుకున్న ఇల్లు ఇప్పటికే ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోయిన వార్త మనందరికీ తెలుసు. ఆ భవన నిర్మాణం కోసం ఏకంగా 12,000 కోట్లే ఖర్చు చేశారు.ఇక ఆయనకు మాత్రమే ప్రతేకమైన కార్లు, జెట్ ఫ్లైట్, అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.ఆయన అప్పట్లో తన భార్య నీతూ అంబానికి ప్రత్యకమైన విమానాన్ని తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు.

ఇప్పుడు నౌకలో విలాసవంతమైన భవనం

ఇప్పుడు తాజాగా ఒక నౌక మీద ఒక ఇల్లు కడుతున్నారు. కడుతున్నారు అనడంకన్నా తయారు చేస్తున్నారు అనడం బెటర్. ఎందుకంటే అది సముద్రం మీద తేలాడే ఒక భవనం.ఈ భవనం నిర్మించాలనే ఆలోచన ఆయన భార్య నీతూ ఆలోచనే అంట..