ఉద్యమానికి సిద్దమవుతున్న ముద్రగడ ! పొలిటికల్ హీట్ పెంచుతారా ..?

కాపులను బీసీల్లో చేర్చాలంటూ… అప్పట్లో పెద్ద పోరాటమే మొదలు పెట్టి అన్ని రాజకీయ పార్టీలను గడగడలాడించిని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు.ఆయన టీడీపీ… జనసేన పార్టీల్లో చేరబోతున్నారు అంటూ అనేక వార్తలు వినిపించినా ఆయన మాత్రం కనీసం స్పందించలేదు.

 Mudragada Wants To Fight Against Chandrababu Naidu-TeluguStop.com

అంతే కాదు ఒక దశలో ఆయన జనసేన పార్టీ లో చేరడం దాదాపు ఖాయం అయిపొయింది అనుకుంటున్నా సమయంలో ఆయన వెనుకడుగు వేశారు.కానీ అంతా గప్ చుప్ అయిపోయారు.

ఇక ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో … మళ్ళీ తన ఉనికి చాటుకునేందుకు సిద్ధం అయ్యాడు ముద్రగడ.

ఇప్పుడు ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేనందున సరిగ్గా ఈ సమయంలోనే కాపు ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించి రాజకీయ పార్టీల దగ్గర స్పష్టమైన హామీ తీసుకోవాలని ముద్రగడ ప్రయత్నిస్తున్నాడు.ఉద్యమ కార్యాచరణపై క్లారిటీ వచ్చిన తర్వాత త్వరలోనే తూర్పు గోదావరి జిల్లాలో కాపు నేతలతో పెద్దయెత్తున సమావేశం పెట్టాలని నిర్ణయించారు.అంతే కాకుండా … ఈ సారి ఉద్యమాన్ని కొత్త తరహాలో తీసుకెళ్లాలని చూస్తున్నాడు అందుకే… మహారాష్ట్ర మరాఠాలు రిజర్వేషన్ల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు.

అక్కడ మరాఠాలు ఉద్యమం తీవ్రంగా జరగడంతో … అక్కడి సర్కార్ రిజర్వేషన్లు ఆమోదించడమే కాకుండా దాని కేంద్ర ప్రభుత్వానికి పంపారు.మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అంతే కాదు విద్యా, ఉపాధి రంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శానసనభ ఆమోదం తెలియజేసింది.

కానీ… ఏపీలాగానే బంతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటూ తప్పించుకోవాలని చూసినా… వారు మాత్రం ఆందోళనలు విరమించలేదు.తమకు రిజర్వేషన్లుఅమలయ్యేంత వరకూ ఉద్యమిస్తామని వారంటున్నారు.అదే స్పూర్తితో ఏపీలో కాపు ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ముద్రగడ చూస్తున్నాడు.

ప్రధానంగా శాసనసభ లో ఆమోదం పేరిట కాపు జాతిని మోసం చేశారంటూ చంద్రబాబునే ఆయన టార్గెట్ చేసేలా కన్పిస్తోంది.రిజర్వేషన్ల తమ చేతిలో లేవన్న జగన్ ను కూడా వదలకూడదని ముద్రగడ నిర్ణయించుకున్నారు.

త్వరలోనే తూర్పు గోదావరిజిల్లాలో సమావేశం నిర్ణయించి ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు ముద్రగడ సిద్ధం అవుతున్నాడు.ఈ దెబ్బతో ఏపీలో రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube