ముద్రగడ బాదేంటి ...? బాబు ని ముంచేస్తాడా ...?

కాపులను బీసీల్లో చేర్చాలంటూ… ఉద్యమం మొదలుపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అప్పట్లో పెద్ద ఉద్యమాలే చేసాడు.ఏపీ మొత్తం అట్టుడికి పోయింది.

 Mudragada Wants Get Victory On Chandrababu Naidu-TeluguStop.com

ఈ సెగ అన్ని రాజకీయ పార్టీలకు బలంగా తగిలింది.ముఖ్యంగా ఈ విషయంలో కాపులంతా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు.

అయితే రాను రాను ఈ వ్యవహారం చల్లబడిపోయింది.ముద్రగడ కూడా ఎందుకో కానీ సైలెంట్ అయిపోయారు.

ఆయన టీడీపీ , జనసేన, వైసీపీ ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారు అంటూ.వార్తలు వినిపించాయి.

కానీ అవేవి జరగలేదు.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల తంతు ఊపందుకోవడంతో… మళ్ళీ ముద్రగడ హడావుడి మొదలుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాపుల్లో టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత తగ్గించి వారి మద్దతు పొందేందుకు అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ ప్రకటన తరువాత ఈనెల 31 న చలో కత్తిపూడి కార్యక్రమాన్ని తలపెట్టారు ముద్రగడ.ఈ రిజర్వేషన్లపై చర్చ భవిష్యత్తు కార్యాచరణ కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు.అంతేకాకుండా.పద్మనాభాన్ని మరోసారి గృహ నిర్బంధం లో పెట్టడంతో ఆగ్రహించిన ఆయన చంద్రబాబు కు లేఖ రాయడంతో పాటు అనేక విమర్శలు కూడా చేశారు.

కాపు సామజిక వర్గం అంటే చంద్రబాబుకి ఇష్టం లేదని… అందుకే… ఆ సామజిక వర్గంపై క్ష సాధిస్తున్నారని ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమం చేసుకుంటాను అంటే పోలీసులతో అడ్డుకోవడాన్ని నిరశిస్తూ బాబు అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తే అది పరిశీలించి భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తా అన్నారు ముద్రగడ.అప్పటివరకు చలో కత్తిపూడి వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఆయన విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారు.

కాపు జాతిని పదేపదే బాబు అవమానిస్తున్నారని టిడిపి రిజర్వేషన్లు నిజం అయితే ఎందుకు భయపడుతున్నారంటూ ముద్రగడ ప్రశ్నిస్తూ… విమర్శలు చేస్తుండడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.ఎన్నికల ముందు ముద్రగడ ఈ విధంగా.ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వలన ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube