కాపులకు బీసీ - ఎఫ్ సర్టిఫికెట్ ... ముద్రగడ సూచనతో డైలమాలో బాబు  

ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పాడడం అంటే ఏంటో బాబు కి బాగా తెలిసొస్తుంది. గత ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేరుస్తాము అంటూ గొప్పలు చెప్పుకుని ఆ తరువాత ఆ డిమాండ్ నెరవేర్చాలంటూ ఉద్యమం చేసిన వారిపై ఉక్కు పదం మోపిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాపుల ఓట్లకు గాలం వేసే పనిలో పడింది. మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న కాపు లు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఆ అంశాన్ని మళ్ళీ కదిపి వారిలో వేడి పుట్టించాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఆ ఉద్యమం కాస్తా తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఆ అంశం పై ఖచ్చితంగా ఏడోయ్ ఒక నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

Mudragada Request To Chandrababu For Give BC- F-Certificate-

Mudragada Request To Chandrababu For To Give BC- F-Certificate

ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ అంశాన్ని ఇప్పుడే గట్టిగా పట్టుకుని ఎదో ఒకటి తెల్చేయ్యలనే కసితో ఉన్నాడు. అందుకే పార్టీల వైకిరి ఏంటో తెలుసుకునేందుకు రకరకాల ప్రకటనలు ఇస్తూ కాకా పుట్టిస్తున్నాడు. ‘బీసీలు అడ్డుపడుతున్నారని, కేంద్రం నాన్చుతోందని కథలు చెప్పడం మానండి..’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ముందు సరికొత్త ప్రతిపాదన పెట్టేశారు ముద్రగడ . ‘కోటా ఇస్తామంటూ 2014లో మీరే మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు. మీవల్లే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే బాధ్యత కూడా మీమీదే వుంది..’ అంటున్నారు ముద్రగడ.

Mudragada Request To Chandrababu For Give BC- F-Certificate-

‘మీ చేతుల్లో వున్న అధికారాల్ని ఉపయోగించి చేయగలిగినంత చేయండి’ అంటున్నారు. బీసీ-ఎఫ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే తాత్కాలిక వర్గీకరణ చేసి.. తహసీల్దార్ల నుంచి కాపులకు కాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పించాలన్నది ముద్రగడ సూచన. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం వైపునకు నెట్టిన చంద్రబాబు.. మళ్ళీ కాపు ఓటు బ్యాంకుని పొందాలంటే మరోసారి ఏదోఒక ‘మాయ’ చేయాల్సిందే కనుక.. ఆ మాయ ఏమిటన్నది ముద్రగడ నోటితోనే చెప్పించారా..? కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేయాలని తెలుగుదేశం భావిస్తోందా? అనే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అలా సర్టిఫికెట్లు ఇస్తామంటే బీసీలు ఊరుకుంటారా ..? అసలు అలా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా .? దీనిపై బీసీలు కోర్టుకు ఎక్కితే ఏంటి పరిస్థితి ..? ఇవన్నిటిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.