పవన్ కి నాకు పోలికా..???..అంత మాట అనేశాడేంటి..??

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సమీకరణాలు ఊపందుకుంటున్నాయి.రాజకీయ పార్టీలలో కుల సమీకరణాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

 Mudragada Padmanabham Sensational Comments On Pawan Kalyan-TeluguStop.com

ఈ క్రమంలోనే మరో సారి తెరపైకి కాపుల రిజర్వేషన్ అంశం వచ్చింది…కాపు ఉద్యమ నేతగా ,కాపులని ఏపీలో ఒకే తాటిపై నిలబెట్టిన వ్యక్తిగా ముద్రగడ అప్పట్లో ఒక సంచలనం సృష్టించారు అయితే పవన్ ఎంట్రీ తో ఒక్క సారిగా ముద్రగడ కి చెక్ పడింది.దాంతో ముద్రగడ పేరు కాపులు ఎక్కడా చర్చించించుకోవడం మానేశారు.

అయితే మళ్ళీ ఇప్పుడు ముద్రగడ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.

అయితే గతంలో ముద్రగడకి పవన్ కి మాంచి సన్నిహిత సంభంధాలు ఉండేవి…గతంలో పవన్ తన పార్టీ కీలక వ్యక్తులని సైతం ముద్రగడ ఇంటికి పంపి తన పార్టీలోకి ఆహ్వానించారు అయితే అప్పట్లో ఏవో కారణాల వలన జనసేనలోకి ముద్రగడ రాలేకపోయారు.అయితే ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంభంధాలు మాత్రం కొనసాగించారు అయితే తాజాగా ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.పవన్ కి ముద్రగడ కి మధ్య చెడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఇద్దరు కాపు నేతల మధ్య గ్యాప్ రావడం సంచలనం రేకెత్తిస్తోంది.

అయితే తాజాగా ముద్రగడ కాపు ఉద్యమం గురించి మాట్లాడుతూ అధికారంలో వచ్చి నాలుగేళ్ళు దాటుతున్నా సరే ఇప్పటికి ఈ అంశంపై చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని మా హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న తమని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు.

అయితే త్వరలో ఈ విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ప్రకటించారు.ఈ క్రమంలోనే పవన్ పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ తో మాకు ఎటువంటి సంభంధం లేదని పవన్ స్థాపించిన పార్టీ ఒక పొలిటికల్ పార్టీ మాత్రమేనని మాది ఉద్యమమని రెండిటికి ఎలా సారూప్యత ఉంటుందని ఆయన ప్రశ్నించారు…పార్టీలు వేరు ఉద్యమం వేరని రెండిటిని కలపలేమని తెగేసి చెప్పారు.దాంతో ముద్రగడ పవన్ ఒక్కటి కాదని.జనసేనలోకి ముద్రగడ చేరే ప్రశక్తి లేదనే క్లారిటీ ఇవ్వడానికే ఆయన ఇటువంటి ప్రకటనలు చేశారని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube