ఇదేం బాలేదండి ! నిమ్మగడ్డ కు ముద్రగడ లేఖ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య మొదలైన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతున్నటు గానే కనిపిస్తోంది.ఇప్పటికే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా,  మరికాసేపట్లో దీనిపై తీర్పు వెలువడనుంది.

 This Is Not Fair...mudragada Writes Open Letter To Nimmagadda, Mudragada Padmana-TeluguStop.com

ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా లేదు.ఒకవేళ  సుప్రీంకోర్టు ఎన్నికలు యథావిధిగా  నిర్వహించాలని ఎస్ ఈసీ కి అనుకూలంగా తీర్పు ఇస్తే, మెరుపు సమ్మె చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని జనసేన, బీజేపీ, టీడీపీలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో కి కాపు ఉద్యమ నాయకుడు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కూడా వచ్చి చేరారు.

తాజాగా ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఉద్దేశించి ఘాటు లేఖ కూడా రాశారు.ఆ లేఖలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం నవ్వు తెప్పిస్తుంది అని,  ఆయన రాజకీయ నాయకుడి  మాదిరిగా ప్రతిష్టంభనకు వెళ్తున్నారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు నిమ్మగడ్డ వెనుక ఎవరో  రాజకీయ అదృశ్య శక్తి ఉంది అని , ఆ శక్తే ఆయన్ను నడిపిస్తోంది అంటూ ముద్ర గడ తన లేఖలో పేర్కొన్నారు.

Telugu Ap, Janasena, Kapu-Political

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలి తప్ప, ఈ విధంగా పట్టుబట్టడం సరి కాదు అంటూ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాను సైతం ముద్రగడ ప్రస్తావించారు.నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే, ఎన్టీఆర్ నటించిన నేరం నాది కాదు ఆకలిది అనే సినిమాని గుర్తు చేస్తుంది అంటూ ముద్రగడ ఘాటుగా విమర్శించారు.పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో ఉన్న నిమ్మగడ్డ ప్రభుత్వ ఉద్యోగం లో ఉంటూ ఈ విధంగా రాజకీయాలు చేయడం సరికాదు అంటూ హితవు పలికారు.

ఈ తరహా పరిస్థితి దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నాము అని, ముద్రగడ తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి సంస్కరణలు తీసుకు రావాలి తప్ప, ఇలా రాజకీయాలకు పాల్పడడం తగదని సూచించారు.ఎన్నికలలో మద్యం, డబ్బుల ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించగలం అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అంటూ నిలదీశారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు చురకలు అంటించారు.ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఏర్పడిన వివాదం కారణంగా కోర్టులో పిటిషన్లు, కేసుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ముద్రగడ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube