న‌న్ను అరెస్టు చేసుకోండి..ముద్రగడ దీక్ష

తుని ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టుల ప‌ర్వానికి తెరలేప‌డంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యూహాత్మ‌కంగా తనను అరెస్టు చేయాలని డిమాండ్‌తో అమ‌లాపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.మంగళవారం ఉదయం తన అనుచరులు, కాపు నాయకులతో కలిసి అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగ‌టంతో ఆయ‌న‌కు స‌ర్గి చెప్పే ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నారు పోలీసులు.

 Mudragada Sit Before Amalapuram Ps-TeluguStop.com

ఎలాంటి హ‌డావిడి లేకుండా జ‌ట్లు జ‌ట్లుగా ముద్ర‌గ‌డ అనుచ‌రులు పోలీస్ స్టేష‌న్‌ని చేరుకోవ‌టంతో వారిని నిలువ‌రించేందుకు పోలీసులు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.తుని ఘ‌ట‌న‌లో కేసులుండంవ‌ని మంత్రులు హామీ ఇచ్చి, ఇప్పుడు త‌న అనుచ‌రుల‌ను అరెస్టుల‌తో భ‌య‌పెట్టాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంద‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు.

అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టే వరకు ఆందోళన విరమించేది లేదని స్ప‌ష్టం చేసారాయ‌న‌.

ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనేనని, ముందుగా నన్ను అరెస్టు చేసుకోవ‌చ్చ‌ని డిమాండ్ చేస్తుండ‌టంతో ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి పోలీసు వ‌ర్గాలు.

ముద్ర‌గ‌డ ధ‌ర్నా విష‌యం జిల్లాలోని కాపునేత‌ల‌కు స‌మాచారం అంద‌టంతో భారీ ఎత్తున కాపు నేతలు అమలాపురం చేరుకుంటున్నారు దీంతో.అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మొహరించ‌డంతో .

.ముందస్తు అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న‌ ముద్రగడ కు సర్దిచెప్పే ప్రయత్నం చేసేందుకు జిల్లా ఎస్‌పి అమ‌లాపురానికి వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

పోలీస్ స్టేష‌న్ ముందు ముద్రగడ దీక్ష విర‌మించ‌కుంటే అరెస్టు చేసి కాకినాడ లేదా కిర్లంపూడి తరలించాల‌ని, భ‌విష్య ప‌రిణామాల‌కు కూడా ముద్ర‌గ‌డ‌నే బాధ్యుడిని చేయాలంటూ రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలున్న‌ట్టు విన‌వ‌స్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube