రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు ముద్రగడ లెటర్..!!

Mudragada Letters Two Cms Of Telugu States

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.గతంలో ప్రత్యక్ష రాజకీయాల నుండి కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ముద్రగడ పద్మనాభం మళ్ళీ.

 Mudragada Letters Two Cms Of Telugu States-TeluguStop.com

క్రియాశీలక రాజకీయాలలో ప్రత్యక్షంగా కాకపోయినా.లేఖ అస్త్రాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన క్రమంలో.ముద్రగడ లెటర్ ద్వారా స్పందించడం జరిగింది.

 Mudragada Letters Two Cms Of Telugu States-రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు ముద్రగడ లెటర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో చంద్రబాబు హయాంలో తానూ.తన కుటుంబం ఈ మాదిరిగానే.

బాధపడినట్లు.తెలియజేస్తూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.

ఆ తర్వాత ప్రధాని మోడీకి లెటర్ రాస్తూ విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని కోరారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులను ప్రభుత్వలు ఆదుకోవాలని.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని సూచిస్తూ.

ఏపీ సీఎం జగన్ కి అదేరీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముద్రగడ పద్మనాభం లెటర్ రాయడం జరిగింది.తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు సమస్య హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధాన్యం రైతాంగ సమస్యలపై లేఖ రాశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ముద్రగడ కోరారు.

పాడైన ధాన్యం నుండి ఆర్ ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు.అదేవిధంగా నిత్యం మీరు ఉండే చోట వరి తప్ప వేరే పంట… వేయటం కుదరదని స్పష్టం చేశారు.

#Cm #YS Jagan #Paddy #Mudragada #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube