పవన్ కి ముద్రగడ లేఖ వెనుక భారీ స్కెచ్..     2018-04-22   03:07:41  IST  Bhanu C

-

-

గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రగడ అంతా నిశితంగా పరిశీలిస్తే అసలు పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకోవడానికి మీడియా అధినేతలని తిట్టడానికి , నాకు అన్యాయం జరిగింది నా తల్లిని కాపాడుకోలేని నేను వ్యర్ధం చచ్చిపోతాను అని చెప్పడానికి అసలు బలమైన కారణాలు ఏమున్నాయి అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు…ఈ గొడవకి కారణం అయిన శ్రీ రెడ్డి సారీ అమ్మా అని చెప్పింది అయినా సరే పవన్ కళ్యాణ్ తన తల్లి విషయంలో ఇంత సీరియస్ గా ఉండటానికి ఈ గొడవని మరింతగా పెంచడానికి కారణం ఏమిటి అంటే రాజకీయ లబ్ది అని చాలా సులువుగా అర్థం అవుతోంది..అందరిలాగా నేను రాజేకీయాలు చేయను అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు చేస్తోంది ఏమిటి అంటూ అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు..

ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు స్పందించని ముద్రగడ మొదటి సారిగా స్పందించారు అంతేకాదు ఏకంగా లేఖని రాసి పంపారు పవన్ కి అసలు ఏమిటా లేఖ అంటే మీరు ఎంతో గొప్ప ఉద్యమం చేస్తున్నారు మీ ఉద్యమానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము..మీ తల్లిగారిని తిట్టినందుకు మీరు చేస్తున్న ఉద్యమంలో నా సపోర్ట్ కూడా ఉంటుందని అన్నారు అంతేకాదు చంద్రబాబు మిమ్మల్ని అణగదొక్కాలని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు మీరు తన పర భేదం లేకుండా బయటకి రండి చంద్రబాబు ని రోడ్డు మీదకి రాగండి అంటూ సలహాలు ఇస్తున్నారు.