అమెరికాలో బురద ఫెస్టివల్,ఎంజాయ్ చేసిన ప్రజలు  

Mud Day Celebrations In West Land-beer Festival,mud Day Celebrations,west Land,అమెరికా లోని వెస్ట్ లాండ్,బీర్ ఫెస్టివల్

మనం నడిచే దారిలో కాస్త బురద ఉంటేనే చిరాకు పడతా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ బురద తో వేడుకలు చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా. ప్రతి ఏడాది అమెరికా లో ఈ బురద వేడుక అనేది జరుగుతుందట..

అమెరికాలో బురద ఫెస్టివల్,ఎంజాయ్ చేసిన ప్రజలు -Mud Day Celebrations In West Land

అమెరికా లోని వెస్ట్ లాండ్ లో ఈ 32 వ బురద వేడుక జరిగింది. ఈ వేడుక అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ వేడుకకు చిన్నా పెద్దా అన్న ఏమాత్రం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వీరి వేడుకల కోసం ప్రత్యేకంగా ఒక బురద కొలను కూడా ఏర్పాటు చేస్తారట. ఎవరి దేశ సంప్రదాయాల ప్రకారం అక్కడ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.

ఇలా బురద ఫెస్టివల్,అలానే బీర్ ఫెస్టివల్ ఇలా పలు రకాల రకాల ఫెస్టివల్స్ విదేశీ సంస్కృతీ లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫెస్టివల్స్ ని అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అమెరికా లోని డెట్రాయిట్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బురద వేడుకకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తూ ఉంటారు..

ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా భారీ గా తరలివచ్చిన పిల్లలు,పెద్దలు అందరూ కూడా ఆ ప్రత్యేక బురద కొలనులో ఆడుతూ పాడుతూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించి వీడియో లను సామజిక మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేసి ఈ ఫెస్టివల్ కి మరింత ఆదరణ పెరుగుతుంది. విదేశాల్లో ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అదే భారత్ లో అయితే బురద చూడగానే ఆమడ దూరం పారిపోతూ ఉంటారు.

కానీ అమెరికా లో మాత్రం ఇలాంటి బురద ఫెస్టివల్ నిర్వహించి ప్రజలకు బురద గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు.