వికెట్ల వెనుక ధోని ఉంటే కోచ్ అవసరం లేదంటన్న టీమిండియా ప్లేయర్…!  

if dhoni is behind the wickets he is a team india player who does not need a coach, msdhoni, kuldeep singh, team india, keeping, test, one day - Telugu Keeping, Kuldeep Singh, Msdhoni, One Day, Team India, Test

మహేంద్ర సింగ్ ధోని… ప్రపంచ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన.ఐసీసీ నిర్వహించిన అన్ని మేజర్ టోర్నీలో విజేతగా నిలిచిన ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని.

 Msdhoni Kuldeep Singh Team India Keeping

అయితే గత సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తర్వాత మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ క్రికెట్ ఆడలేదు.ఆ తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకున్నారు.

మరికొన్ని రోజులు భారత ఆర్మీ లో బాధ్యతలు నిర్వహించారు.తాను గతాన్ని పక్కన పెట్టి ఐపీఎల్ 2020 సీజన్ లో తన మార్కును చూపెట్టి తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నాడు.

వికెట్ల వెనుక ధోని ఉంటే కోచ్ అవసరం లేదంటన్న టీమిండియా ప్లేయర్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక టీమిండియా ఆటగాళ్లలలో చాలామంది ధోని ని ఒక గురువుల చూసే వారు చాలా మంది ఉన్నారు.టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ ధోని పై ఎంతో నమ్మకం, గౌరవం ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

అయితే దానిని మరోసారి నిరూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లో కోచ్ లేని లోటును ధోని తీర్చేవాడని, తనకు అలాగే చాహల్ కు ఎన్నోసార్లు ఎంతో విలువైన సలహాలను ఇచ్చి మ్యాచ్ ను మొత్తం టీమిండియా వైపు తెచ్చేలా చేశాడని చెప్పుకోచ్చాడు.

అయితే ఇప్పుడు దానిని తాము చాలా మిస్ అవుతున్నామని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి కోచ్ ఉండడని, మ్యాచ్ ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ధోని ఎదురుగా ఉంటే భరోసా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ జరుగుతున్నంత సేపు ధోని ఆటగాళ్లకు ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.అంతేకాదు బంతిని ఎటువైపు వేయాలి, ఎంత స్పిన్ చేయాలి అంటూ ప్రతి ఒక్క సారి గుర్తు చేస్తూ… ప్రోత్సహిస్తూ ఉంటాడని దాంతో బౌలర్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసుకుంటారని ప్రశంసలు కురిపించాడు.

ఇక కొన్నిసార్లయితే మొత్తం ఫీల్డ్ సెట్ చేసి, బంతి ని కూడా ఎలా వేయాలో కూడా తానే చెప్పాడని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.ఇక ధోనీ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ లాగే సూచనలు ఇస్తున్నాడని, అయినా కానీ… మహేంద్రసింగ్ ధోని ఉంటే బాగుండు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇక కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున 60 వన్డేలు, 21 టి20 లు, ఆరు టెస్టులు ఆడాడు.అన్ని ఫార్మాట్లకు కలిపి కుల్దీప్ యాదవ్ 167 వికెట్లను పడగొట్టాడు.

ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది.

#Msdhoni #Test #Keeping #Team India #One Day

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Msdhoni Kuldeep Singh Team India Keeping Related Telugu News,Photos/Pics,Images..