ఈ వయసులో ఇలాంటి సినిమాలు ఏంటీ రాజు గారు?

టాలీవుడ్‌ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు కాని కొందరు మాత్రమే గుర్తుండి పోతారు.ఎందుకంటే వారు కథను నమ్మి సినిమా లు తీశారు.

 Ms Raju New Film 7 Days And 6 Nights-TeluguStop.com

వారి సినిమాలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అలాంటి నిర్మాతల్లో ఒకరు ఎం ఎస్ రాజు.

ఈయన నిర్మాణం లో వచ్చిన పలు సినిమా లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సైతం దక్కించుకున్న సినిమా లను ఈయన నిర్మించిన విషయం తెల్సిందే.

 Ms Raju New Film 7 Days And 6 Nights-ఈ వయసులో ఇలాంటి సినిమాలు ఏంటీ రాజు గారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఎం ఎస్ రాజు అంటే అందరికి గౌరవం.ఇండస్ట్రీ లో పలువురు హీరోలకు హిట్ లను అందించిన ఈయన కాల క్రమేనా నిర్మాతగా నిరాశ పర్చుతూ వచ్చాడు.

మెల్లగా నిర్మాణంకు దూరం అయ్యాడు.ఈయన సినిమా నిర్మాణం కు దూరం అయ్యి దర్శకత్వం వైపు అడుగులు వేశాడు.

అప్పటి నుండి కూడా ఈయన వరుసగా సినిమా లు చేస్తూ వస్తున్నాడు.

ఇటీవల ఈయన డర్టీ హరి అనే సినిమాను చేశాడు.

ఆ సినిమా మరీ బూతు సినిమా మాదిరిగా ఉంది.అక్రమ సంబంధాలు అసభ్య కార్యక్రమాల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది.

ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఉండే ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాకుండా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది.ముసలోడు అయిన ఈ వయసు లో డర్టీ సినిమాలు ఏంటీ రాజు గారు అంటూ కొందరు ఆయన్ను విమర్శించారు.అయినా కూడా తన ఆలోచన మార్చుకోలేదు.డర్టీ హరి తర్వాత ఈ రాజు గారు 7 డేస్‌ 6 నైట్స్‌ సినిమా ను చేస్తున్నట్లుగా ప్రకటించాడు.టైటిల్‌ ను చూస్తుంటేనే ఇదేదో కాస్త అటు ఇటు గా బూతు సినిమా మాదిరిగానే ఉంటుందేమో అనిపిస్తుంది.రాజు గారు మళ్లీ మళ్లీ విమర్శలు పడేందుకు ఇలాంటి సినిమా లు తీయడం చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బర్త్‌ డే సందర్బంగా ఎం ఎస్ రాజు ఈ సినిమా ను అనౌన్స్ చేశాడు.

#Ott Relese #M.S.Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు