ధోని మళ్ళీరావా..2019 లో ధన్ ధనాధన్ ధోనీని చూస్తామా...  

Ms Dhoni To Retire After World Cup 2019..?-dhan Dhana Dhan Dhoni,dhoni Retirement,ms Dhoni,world Cup 2019,ధనాధన్ ధోనీని,ధోని రిటైర్మెంట్

మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు చెబితే చాలు క్రికెట్ అభిమానుల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అతడు బ్యాటింగ్ కోసం స్టేడియం లోకి అడుగు పెడితే చాలు ధోని ధోని అంటూ అభిమానుల నుండి అరుపులు మొదలవుతాయి. ఎటువంటి మ్యాచ్ ని అయిన తన ఫీనిషింగ్ టచ్ తో గెలిపించే సత్తా ఉంది..

ధోని మళ్ళీరావా..2019 లో ధన్ ధనాధన్ ధోనీని చూస్తామా...-MS Dhoni To Retire After World Cup 2019..?

అందుకే ఆయనని బెస్ట్ ఫీనిషేర్ అని పిలుస్తారు. ధోని సారథ్యం లో భారత జట్టు దాదాపు గా అన్ని ఐసీసీ మెగా టోర్నమెంట్స్ లో కప్ కొట్టింది. ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా భారత జట్టు కి సేవలందిస్తున్న ధోని వచ్చే ప్రపంచ కప్ తన కెరీర్ లో చివరిది కానుంది.

ప్రపంచ కప్ అనంతరం ధోని రిటైర్ అవుతాడని చాలా మంది అభిప్రాయం. ధోని కూడా పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపాడు.

2019 ప్రపంచ కప్ లో ధన్ ధనాధన్ ఉండబోతుందా

మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ మొదటిలో పొడవాటి జులపలు వేసుకొని మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడు. కొన్ని మ్యాచ్ లలో 3 వ స్థానం లో బ్యాటింగ్ కి దిగేవాడు. ధోని క్రీజులోకి వస్తున్నాడంటే స్టేడియం సిక్స్ లతో మారుమ్రోగేది.

అతని కెరీర్ ఆరంభం లో అతడి బ్యాటింగ్ చూసి ధన్ ధనాధన్ ధోని గా ప్రముఖ పత్రికలు కితాబునిచ్చారు. అప్పట్లో అతడు పాకిస్తాన్ పైన 148 పరుగులు , శ్రీలంక పైన 183 పరుగులు చేసి భారత జట్టు లో తనదైన ముద్ర వేశాడు. శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో లక్ష్య చేదన లో అతను 183 పరుగులు చేసి నాటౌట్ గా ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకవేళ జట్టు లక్ష్యం మరికొన్ని పరుగులు ఎక్కువగా ఉంటే 2005 లొనే ధోని వన్డే లలో డబల్ సెంచరీ చేసేవాడు అనడం లో సందేహం లేదు. అలా అతని ధన్ ధనాధన్ బ్యాటింగ్ తో అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిష్టర్ ముషారఫ్ తో కూడా ప్రసంశలు అందుకున్నాడు. ధోని కెరీర్ మొదట్లో ఆడినట్లు తను నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాక ఆడలేదు అన్నది అందరికి తెలిసిందే.

దానికి కారణం కెప్టెన్సీ చేపట్టడం ఒకటైతే ధోని తన బ్యాటింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకొని జట్టు కి మంచి ఫీనిషేర్ గా బాధ్యత తీసుకున్నాడు. చివరి ఓవర్ కి వెళ్లిన చాలా మ్యాచ్ లలో ధోని భారత్ ని గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా లో జరిగిన వన్డే సిరీస్ గెలవడం లో ధోని ముఖ్యపాత్ర వహించడం. చాలా కాలం తరువాత వన్డే లలో ధోని మ్యాన్ ఆఫ్ ధ సిరీస్ గా నిలిచాడు.

రాబోయే ప్రపంచ కప్ లో ధోని సేవలు భారత జట్టు పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తుంది. వికెట్ ల వెనుక అతడి కీపింగ్ జట్టుకు ఎంతో అవసరం ముఖ్యం గా స్పిన్నర్లు అయిన చహల్ , కుల్దీప్ లు ధోని సలహాలతో చాలా మ్యాచ్ లలో వికెట్ లు తీశారు. ఇకపోతే ధోని మునుపటి లాగా ధన్ ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడితే మన జట్టు ప్రపంచ కప్ గెలవడానికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి..

మహేంద్రుడి విజృంభన మళ్ళీ చూస్తామో లేదో తెలియాలంటే ప్రపంచ కప్ వరకు వేచి చూడాల్సిందే…