క్రికెట్ కి ధోని రెండు నెలలు దూరం! ఆర్మీలో సేవలు  

Ms Dhoni Takes A Break From Cricket To Serve Indian Army-

క్రికెట్ లో టీం ఇండియాలో అత్యధిక విజయాలు అందించి, రెండు ప్రపంచ కప్ లని భారత్ ఖాతాలో వేసిన దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.ఎంతటి క్రికెట్ దిగ్గజానికి అయిన చివరి రోజులు చాలా క్లిష్టంగా ఉంటాయి.ఈ విషయం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విషయంలో కూడా జరిగింది...

Ms Dhoni Takes A Break From Cricket To Serve Indian Army--MS Dhoni Takes A Break From Cricket To Serve Indian Army-

సచిన్ కెరియర్ చివరి దశలో భాగా రాణిస్తున్న కూడా ఎప్పుడు సచిన్ రిటైర్మెంట్ తీసుకుంటాడు.కొత్తవాళ్లకి ఎప్పుడు అవకాశం ఇస్తాడు అని కామెంట్స్ చేసారు.ఇప్పుడు అదే పరిస్థితి ధోనికి కూడా ఎదురవుతుంది.

ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో ఓడిపోయినా తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుంది.కొంత మంది మాజీలు ధోని రిటైర్మెంట్ తీసుకొని కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలని అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం ధోని సేవలు టీం ఇండియాకి మరికొంత కాలం కావాలి, రిటైర్మెంట్ మీద నిర్ణయం తీసుకునే స్వేచ్చ అతనికే ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగ ధోని రిటైర్మెంట్ గురించి అతను స్పందించాడు.

Ms Dhoni Takes A Break From Cricket To Serve Indian Army--MS Dhoni Takes A Break From Cricket To Serve Indian Army-

త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కు తాను అందుబాటులో ఉండనని ప్రకటించాడు.రెండు నెలల పాటు ప్యారామిలిటరీ రెజిమెంట్ కు సేవలందించాలనుకుంటున్నానని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసారు.ఇక ధోని తన నిర్ణయం గురించి రెండు నెలల క్రితమే కెప్టెన్ కోహ్లి, సెలక్షన్ కమిటీతో చెప్పడం జరిగిందని సపాచారం.

అయితే రిటైర్మెంట్ గురించి మాత్రం ధోని ఇప్పట్లో చెప్పే ఆలోచన లేదని తన మాటల బట్టి తెలుస్తుంది.