ధోని రహస్యం ఇన్నాళ్లకు గాని తెలియలేదు.. అతడు క్రికెట్ కంటే ఆ ఆటనే బాగా ఆడతాడట!

మహేంద్ర సింగ్ ధోని.పరిచయం అక్కర్లేని పేరు.

 Ms Dhoni Spends More Time By Playing E Sports Says Harbhajan Singh Details,  Ms-TeluguStop.com

జార్ఖండ్ డైనమైట్ గా టీమిండియాలో ప్రవేశించిన ధోని, అనతికాలంలోనే ఇండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.క్లిష్ట పరిస్థితులలోను మైదానంలో ప్రశాంతంగా వుండే ధోని మిస్టర్ కూల్ గా ప్రసిద్ధి కెక్కాడు.2007 వన్డే ప్రపంచ కప్ లో దారుణ వైఫల్యం తర్వాత భారత్ కు కెప్టెన్ గా ఎంపికై, 2008లో జరిగిన తొలి T20 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలిపి, విజయకేతనం ఎగురవేశాడు.దాని తరువాత 2011లో వన్డే ప్రపంచ కప్ ను సాధించి 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ తల గర్వంగా పైకెత్తేలా చేసాడు.

ధోని రహస్యం ఇదే:

ఇకపోతే ధోని గురించి తాజాగా ఓ విషయం తెలిసింది.భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ విషయం లీక్ చేసాడు.

ధోనికి క్రికెట్ తో పాటు బైక్ నడపడం, ఫుట్ బాల్ ఆడటం ఇష్టమని మనందరికీ తెలుసు.అయితే ధోని గురించి తెలియని మరో విషయం కూడా ఉంది.

అదే వర్చువల్ గేమింగ్ అయిన ఈ స్పోర్ట్స్.అవును ధోని ఎలక్ట్రానికి గేమింగ్ కు పెద్ధ ఫ్యాన్ అంట.క్రికెట్ కంటే కూడా 15 రెట్లు ఎక్కువ సార్లు ఈ స్పోెర్ట్స్ ను ఆడినట్లు భజ్టీ తెలిపాడు.ఈ స్పోర్ట్స్ గేమ్స్ అయిన పబ్ జీ, ఫుట్ బాల్ ఆడాడని టర్బోనేటర్ తెలిపాడు.

హర్భజన్ మాటల్లోనే వినండి:

“క్రికెట్ కంటే కూడా ధోని ఈ స్పోర్ట్స్ ను 15 రెట్లు ఎక్కువగా ఆడి ఉంటాడు.మీరు ధోనిని హోటల్ రూమ్ లో చూస్తే, అతడు ఈ స్పోర్ట్స్ ను ఆడుతూ కనిపిస్తాడు.కొన్నిసార్లు ఫిఫా, మరికొన్ని సార్లు పబ్ జీ, ఇంకొన్ని సార్లు ఇతర వర్చువల్ గేమ్స్ ను ఆడుతూ ఉంటాడు.” అని స్పిన్ లెజెండ్ హర్భజన్ పేర్కొన్నాడు.వరల్డ్ ఈ స్పోర్ట్స్ కప్ ఈవెంట్ బహుమతుల ప్రాదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Ms Dhoni Spends More Time By Playing E Sports Says Harbhajan Singh Details, Ms Dhoni, Latest News, Viral Latest, Coverage, Virtual Gaming, Video Games, Esports, Harbhajan Singh, Pubg, Fifa, Ms Dhoni Esports - Telugu Coverage, Fifa, Harbhajan Singh, Latest, Dhoni, Msdhoni, Pubg, Games, Virtual

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube