ధోనీ సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్సీకి గుడ్ బై..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి.ఎందుకంటే ఇది మిగతా అన్ని జట్ల కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ గెలుచుకుంది.

 Ms Dhoni Shocking Decision Good Bye For Csk Team Captaincy Ipl Details, Ms Dhoni-TeluguStop.com

టీమిండియా మాజీ సారథి, కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ మంచి ప్రదర్శన వల్లే ఇది సాధ్యమైందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే 2010, 2011, 2018, 2021 సీజన్లలో విజయకేతనం ఎగరేసిన సీఎస్‌కే జట్టులో ఐపీఎల్ 2022లో కీలక మార్పులు రాబోతున్నాయి.

ముఖ్యంగా మిస్టర్‌ కూల్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడని క్రీడ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ వార్తలతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు.

ఐపీఎల్‌-2022 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా కొత్త ప్లేయర్ ఎంపిక అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం సమాచారం అందుతోంది.ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు విశ్వసనీయ కథనాలు పేర్కొంటున్నాయి.

ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, చెన్నై సీనియర్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా సిద్ధంగా ఉన్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.తాను కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటూ ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ధోనీ ఇప్పటికే సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో సారథ్య బాధ్యతల గురించి డిస్కస్ చేసినట్లు సమాచారం.

Telugu Captiance, Csk Dhoni, Csk, Bye, Ipl Season, Dhonicsk, Msdhoni, Ravindra J

నిజానికి ఐపీఎల్ 2022 సీజన్‌ తో ఐపీఎల్ కు ధోనీ వీడ్కోలు పలకనున్నాడు.ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి జడేజాను ఎంపికచేసుకోవాలని చూస్తోంది.అయితే వెళ్తూ వెళ్తూ జడేజా కి విలువైన కెప్టెన్సీ స్కిల్స్ ధోనీ అందించాల్సిందిగా మేనేజ్‌మెంట్‌ కోరుతోంది.

అందుకే ఈ ఒక్క సీజన్ లో ప్రాక్టికల్ గా జడేజాకు కెప్టెన్సీ ట్రైనింగ్ లైవ్ లో ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

Telugu Captiance, Csk Dhoni, Csk, Bye, Ipl Season, Dhonicsk, Msdhoni, Ravindra J

దీని గురించి ఇప్పటివరకైతే అనధికారికంగా వార్తలు వస్తున్నాయి.అయితే అధికారిక ప్రకటన విడుదలైతే గానీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాదు.ఇక ఐపీఎల్‌-2022 కోసం సీఎస్‌కే ధోనీ, జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్‌ అలీని రిటైన్‌ చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube