తన రిటైర్మెంట్ గురించి చెప్పకనే చెప్పిన ధోనీ....వీడియో వైరల్  

Ms Dhoni Says Indirectly About His Retirement-ms Dhoni Retirement,telugu Viral News,viral About Ms Dhoni,viral In Social Media,వీడియో వైరల్

గత కొంత కాలంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి జరగబోయే వరల్డ్ కప్ తరువాత ధోనీ మొత్తానికి క్రికెట్ కు గుడ్ బై పలకనున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే దీనిపై ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం తో ఈ వార్తలను కొందరు అభిమానులు కొట్టిపారేశారు..

తన రిటైర్మెంట్ గురించి చెప్పకనే చెప్పిన ధోనీ....వీడియో వైరల్ -MS Dhoni Says InDirectly About His Retirement

తన కెప్టెన్సీలో టీమిండియాను రెండు సార్లు వరల్డ్ కప్ చాంపియన్ (టీ20 వరల్డ్ కప్ 2007, వరల్డ్ కప్ 2011)గా నిలిపిన ఎంఎస్ ధోనీ ఇప్పుడు తన క్రికెట్ కెరీర్ చివరి మెట్టుపై ఉన్నాడు.

ఇప్పటికే టెస్ట్ క్రికెట్ సన్యాసం తీసుకున్న 37 ఏళ్ల ధోనీ వరల్డ్ కప్ 2019 తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు వస్తున్నా వార్తల పై ధోనీ స్వయంగా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన రిటైర్ అయ్యాక ఏమి చేయబోతున్నాను అన్న విషయాన్ని ఒక వీడియో రూపంలో బయటపెట్టడం తో ఇప్పడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో లో ధోనీ ఏమి చేశాడంటే. పెయింటింగ్ వేస్తూ ఆ వీడియోలో ధోనీ కనిపించాడు.

వీడియోలో ధోనీ మూడు పెయింటింగ్స్ చూపిస్తూ ‘నేను మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఆర్టిస్ట్ కావాలని కోరిక. నేను చాలా క్రికెట్ ఆడేశాను. ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను..

ఎన్నాళ్లుగానో చేయాలనుకుంటున్నది చేసే సమయం వచ్చిందని భావిస్తున్నాను. అందుకే నేను పెయింటింగ్ వేశాను’ అని చెప్పడం తో అభిమానులలో ఒక క్లారిటీ వచ్చింది. ధోనీ రిటైర్మెంట్ వార్తలు నిజమే అని,ఇదే ధోనీ చివరి ప్రపంచ కప్ అన్న విషయం లో అభిమానులలో ఒక క్లారిటీ లభించింది. ధోనీ 90 టెస్టుల్లో 4876 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అతను ఇప్పటి వరకు 341 వన్డేలు, 98 టీ20 మ్యాచ్ లు ఆడాడు.